Breaking News

ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్ ప్రియాంక.. సడన్‌గా ప్రియుడితో పెళ్లి!

Published on Wed, 04/03/2024 - 14:14

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్‌-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది. హౌస్‌ నుంచి బయటకు రాగానే గుడ్‌న్యూస్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చింది. దీంతో శివకుమార్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఫ్యాన్స్ ‍భావించారు.

అయితే ఎప్పటికప్పుడు తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అప్‌డేట్స్‌ ఇస్తూ ఉండే ప్రియాంక సడన్‌గా తన అభిమానులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా తన ప్రియుడిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. మా పెళ్లి అయిపోయింది అంటూ ప్రకటించారు. రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం అంటూ ప్రకటించాడు శివకుమార్‌. త్వరలోనే తమ పెళ్లి వీడియో కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తీరా చూస్తే ఇదంతా షూటింగ్ కోసమే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మా ఇంటి పండుగ అనే షూటింగ్ జరిగింది. ఇందులో ప్రియాంక, శివ కుమార్‌కు పెళ్లి జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో వీడియో కూడా రిలీజైంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు