Breaking News

నేనే అమ్మాయినైతే.. శివరాజ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Fri, 04/18/2025 - 07:00

కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్( Shiva Rajkumar), రియల్‌ స్టార్‌ ఉపేంద్ర కలిసి నటించిన తాజా చిత్రం 45. ఎస్పీ స్వరాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుమతి ఉమా రమేష్‌రెడ్డి, ఎం. రమేష్‌ రెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్‌ జాన్య దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా  ఈ చిత్ర తమిళ్‌ వెర్షన్‌ టీజర్‌ను చెన్నైలో విడుదల చేశారు. స్థానిక రాయపేటలోని పీవీఆర్‌ సత్యం థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు శివరాజ్‌ కుమార్‌, ఉపేంద్ర, నిర్మాత రమేష్‌ రెడ్డి, చిత్ర దర్శకుడు అర్జున్‌ జన్య పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నటుడు శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తాను చెన్నైకి ఎప్పుడు వచ్చినా సంతోషం కలుగుతుందన్నారు తాను పుట్టింది, పెరిగింది, చదివింది ఇక్కడే అన్నారు. తనకు నటుడుగా  తొలి అవకాశం వచ్చింది కూడా ఇక్కడే అని పేర్కొన్నారు. అలా పలు మధురమైన జ్ఞాపకాలు తనకు చెన్నైతో ముడిపడి ఉన్నాయని అన్నారు. కాగా తాను ఎప్పుడు హీరో కావాలని కోరుకోలేదని హీరో అంటే కమలహాసన్‌ ,అమితాబచ్చన్‌లో మాదిరి ఉండాలని అనుకునేవాడినని అన్నారు. వారే తన ఫేవరెట్స్‌ అని పేర్కొన్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్‌ తనకు స్ఫూర్తి అని ,తానే గనుక అమ్మాయినైతే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకునే దానినని ఆయనది అంత అందం అని పేర్కొన్నారు. 

తాను నటుడుగా మారిన తర్వాత చాలా జయాపజయాలను  చవి చూశానన్నారు. అయినప్పటికీ వాటిని ఎప్పుడు తలకెక్కించుకోలేదని చెప్పారు. అదేవిధంగా జీవితంలో పలు మరణాలను, దుఃఖాలను ఎదుర్కొన్నానని, తనకు తలలో సర్జరీ జరిగిందని, అదేవిధంగా ఇటీవల క్యాన్సర్‌ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. ఇకపోతే 45 చిత్రంలో నటించడం సంతోషకరమన్నారు. దర్శకుడు అర్జున్‌ జాన్య కథ చెప్పగానే నచ్చిందన్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇంతకుముందు ఎప్పుడూ రానటువంటి వినూత్న కథాంశంతో రూపొందిన చిత్రం 45 అని, ఇది ఏ ఒక్క భాషకు చెందింది కాదని ఇండియన్‌ సినిమా అని నిర్మాత ఎం. రమేష్‌ రెడ్డి పేర్కొన్నారు.   

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)