Breaking News

సినిమాలు మానేసి సెలూన్‌లో పని చేశా.. 10th ఫెయిలైనా..

Published on Wed, 07/09/2025 - 13:10

నమ్రత శిర్కోదర్‌ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తే చెల్లి శిల్ప శిరోద్కర్‌ (Shilpa Shirodkar) బాలీవుడ్‌లో కథానాయికగా అలరించింది. హమ్‌, ఆంఖెన్‌, పెంచన్‌ వంటి సినిమాలతో శిల్ప హిందీలో ఫుల్‌ బిజీ అయింది. అయితే 2000వ సంవత్సరంలో వచ్చిన గజగామిని మూవీ తర్వాత ఆమె వెండితెరకు విరామం ప్రకటించింది. అప్పుడే యూకేకి చెందిన బ్యాంకు ఉద్యోగి అపరేశ్‌ రంజిత్‌ను పెళ్లాడింది. మొదట్లో ఈ దంపతులు నెదర్లాండ్స్‌కు షిఫ్ట్‌ అయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో సెటిలయ్యారు.

కోర్సు నేర్చుకున్నా..
ఇక హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ చూసిన శిల్ప.. సినిమాలు మానేశాక ఏం పని చేసిందనే విషయాన్ని తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఖాళీగా ఉండకుండా బిజీగా గడపాలని న్యూజిలాండ్‌లో హెయిర్‌డ్రెస్సింగ్‌ కోర్సు నేర్చుకున్నాను. ఇందులో మేకప్‌, బ్యూటీ గురించి ఉండటంతో యాక్టింగ్‌కు కనెక్ట్‌ అయి ఉన్నట్లే అనిపించేది. రెండునెలలపాటు సెలూన్‌లో కూడా పని చేశాను. పనిగంటలు సెట్టవకపోవడంతో మానేశాను. 

పదో తరగతి ఫెయిల్‌ అని రెజ్యూమ్‌
కార్పొరేట్‌ సంస్థలో పని చేసిన అనుభవం లేదు కాబట్టి ఇంకేదైనా చేయాలనుకున్నాను. నా భర్తకు నా రెజ్యూమ్‌ సిద్ధం చేయమని చెప్పాను. అందుకాయన రెజ్యూమ్‌లో ఏమని రాయను? అన్నాడు. అబద్ధాలు చెప్పకుండా నా గురించి ఉన్నది ఉన్నట్లు రాయు. 10th ఫెయిల్‌ అని, అలాగే సినిమాల్లో పని చేశానని కూడా పేర్కొనమని చెప్పాను. ఆశ్చర్యంగా ఒక్కరోజే నాకు రెండు జాబ్‌ ఆఫర్స్‌ వచ్చాయి. డన్‌ అండ్‌ బ్రాడ్‌షీట్‌ కంపెనీలో క్రెడిట్‌ కంట్రోలర్‌గా ఉద్యోగంలో చేరాను.

జోక్‌ కాస్తా నిజమైంది
కానీ ఉద్యోగంలో చేరిన కొంతకాలానికే నాకు అలసటగా అనిపించేది. ఇదే మాట నా స్నేహితురాలికి చెప్తే ప్రెగ్నెంట్‌ అయ్యావేమో అని జోక్‌ చేసింది. ఎందుకైనా మంచిదని టెస్ట్‌ చేసుకుంటే పాజిటివ్‌ అని తేలింది. కానీ ఆ జర్నీ అంత ఈజీగా సాగలేదు. ఇన్సులిన్‌ ఇంజక్షన్లు, బరువు తగ్గేందుకు ప్రయత్నాలు.. ఇలా చాలా కష్టాలే పడాల్సి వచ్చింది. అలా నాకు కూతురు అనుష్క పుట్టింది. దాంతో సినిమాలకు మరింత దూరంగా ఉండాల్సి వచ్చింది అని శిల్ప శిరోద్కర్‌ చెప్పుకొచ్చింది.

చదవండి: అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాల్‌?!.. అతడితోనే సమంత విందు, విహారం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)