Breaking News

'బిగ్ బాస్'కి వెళ్లకుండా ఉండాల్సింది.. ఏడేళ్లుగా బాధ: శిల్పా చక్రవర్తి

Published on Sun, 03/16/2025 - 16:27

యాంకర్ శిల్పా చక్రవర్తి.. ఈ పేరు ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియదు గానీ 2000 ప్రారంభంలో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఒకానొక టైంలో సుమకు పోటీ అన్నట్లు నిలిచింది. మధ్యలో కొన్ని  సినిమాలు కూడా చేసింది. కానీ పెళ్లి తర్వాత పూర్తిగా కొన్నాళ్లు స్క్రీన్ కి దూరమైంది. రీఎంట్రీలో బిగ్ బాస్ షోలో పాల్గొంది. పలు షోలు కూడా చేసింది. 

(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత)

సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే శిల్పా చక్రవర్తి ప్రస్తుతం ఏం చేస్తుంది? ఎక్కడుంది? లాంటి విషయాల్ని తనే స్వయంగా బయటపెట్టింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది..

'పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీతో ఉందామని సీరియల్స్, యాంకరింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చాను. రీఎంట్రీ అనుకున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఆ షోలో పాల్గొన్నాను. తర్వాత లైఫ్ మారింది. కానీ షోకి వెళ్లొచ్చిన తర్వాత నన్ను చాలా ట్రోల్ చేశారు. నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. కౌంటర్స్ ఇస్తే బూతులు తిట్టేవాళ్లు. ఇవన్నీ మా ఆయకు చెబితే ఆ షోకి వెళ్లకుండా ఉండాల్సిందని అన్నారు'

(ఇదీ చదవండి: హీరోయిన్ అమలాపాల్ కి ఖరీదైన కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?)

'మరీ దారుణంగా ట్రోల్ చేయడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. దాదాపు నాలుగు నెలల పట్టింది ఆ బాధ నుంచి బయటకు రావడానికి. సరిగ్గా అదే టైంకి కరోనా వచ్చింది. మా ఆయన బిజినెస్ ఆగిపోయింది. డిప్రెషన్ ఇంకా ఎక్కువైంది. కరోనా టైంలో సరైన చికిత్స అందక కోమాలోకి వెళ్లిన నాన్న చనిపోయారు. కరోనా తర్వాత ఆఫర్స్ వచ్చినా ఆసక్తి రాలేదు. సరే చేద్దాం అనుకునేలోపు అమ్మకి రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు బాగున్నారు' అని శిల్పా చక్రవర్తి చెప్పుకొచ్చింది.

ఇలా రకరకాల కారణాలతో ఇన్నాళ్లు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు షోలు, సీరియల్స్ చేస్తున్నానని శిల్ప చెప్పింది. బిగ్ బాస్ 3వ సీజన్ లో ఈమె పాల్గొంది కానీ కొన్ని వారాలకే ఎలిమినేట్ అయిపోయింది. అప్పటినుంచి అంటే దాదాపుగా ఏడేళ్లుగా ఏదో ఒకలా బాధపడుతున్నానని ఇప్పుడు వీడియో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: నాని టైమ్ నడుస్తోంది.. ఈసారి రూ.54 కోట్ల డీల్!)

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)