Breaking News

సుమలత బహిరంగ క్షమాపణ చెప్పాలి: శేఖర్ మాస్టర్

Published on Sat, 09/05/2026 - 18:01

జానీ మాస్టర్‌ సతీమణి సుమలతపై డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్‌కు, ఫెడరేషన్‌కు శేఖర్ మాస్టర్  ఫిర్యాదు చేశారు. తనపై సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని శేఖర్ మాస్టర్ తెలిపారు.

తన ప్రమేయం లేకుండా ఎలాంటి నిరూపిత ఆధారాలు లేకుండా తన మనోభావాలు దెబ్బతినేలా సుమలత అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. తన పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా మాట్లాడారని ఆరోపించారు. ‘కక్కితే కాళ్ల మీద పడతాయి’ అంటూ తనపై అభియోగాలు మోపి, నిందలు వేసి వ్యంగ్యంగా, ఎటకారంగా మాట్లాడారని శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్దల మాటకు గౌరవంతో మౌనం
ఈ వివాదంపై మీడియా ముందుకు రావద్దని, గొడవలు వద్దని పెద్దలు సూచించారని శేఖర్ మాస్టర్ తెలిపారు. వారి మాటకు గౌరవం ఇచ్చే ఇంతకాలం మౌనంగా ఉన్నానని చెప్పారు. అయితే సుమలత వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందన్నారు.
యూనియన్ సభ్యుల కోసం ముందుంటా
‘యూనియన్ సభ్యులకు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటా. యూనియన్ సభ్యులకు పర్సంటేజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని భావించిన సందర్భాల్లో ఎన్నో సాంగ్స్‌ను కూడా వదులుకున్నాను’ అని శేఖర్‌ తెలిపారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుమలత, సీనియర్ డాన్సర్ లక్ష్మి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శేఖర్ మాస్టర్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌పై ఫిర్యాదు

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)