Breaking News

మూర్ఛ వ్యాధి.. ఎప్పుడు, ఎక్కడ వస్తుందోనని భయపడేదాన్ని: నటి

Published on Mon, 04/03/2023 - 21:08

కాంతా లగా... పాటతో 20 ఏళ్ల వయసులో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది షెఫాలీ జరీవాలా. 1972లో వచ్చిన పాటకు ఇది రీమిక్స్‌గా తెరకెక్కింది. ఈ పాట సూపర్‌ క్లిక్‌ అవడంతో తర్వాత ఎన్నో మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో మెరిసింది షెఫాలీ. కానీ జనం మాత్రం ఆమెను కాంతా లగా బ్యూటీగానే గుర్తుపెట్టుకున్నారు. ఆ మధ్య హిందీ బిగ్‌బాస్‌ రియాలిటీ షోలోనూ పాల్గొంది నటి. తాజాగా ఈ నటి బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించింది.

'15 ఏళ్ల వయసులో మొదటిసారి నాకు మూర్ఛ వచ్చింది. అందరూ నన్ను అదోలా చూసేవారు. ఆ వ్యాధి నన్ను పదేళ్లపాటు వెంటాడింది. మూర్ఛ వ్యాధితో జీవించడమనేది ఒక ఛాలెంజ్‌ అనే చెప్పాలి. అంత చిన్న వయసులో నేనొక నిస్సహాయురాలిగా ఫీలయ్యానో లేదో కానీ ఆత్మస్థైర్యంతో మాత్రం ఉండకపోయేదాన్ని. నేను ఎదుగుతున్నకొద్దీ నా ముందు మరిన్ని సవాళ్లు ప్రత్యక్షమయ్యాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సడన్‌గా మూర్ఛ వస్తుందేమోనన్న భయం ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచేది.

కాంతా లగా షూటింగ్‌ చేస్తున్నప్పుడు, ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు ఫిట్స్‌ వస్తుందేమోనని భయంతో వణికిపోయేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. మెడిసిన్స్‌ పుణ్యమా అని 15 ఏళ్లుగా నాకు మూర్ఛ రావడం లేదు. మానసికంగా, శారీరకంగా ఎంతో ధృడంగా ఉన్నాను. ఉత్తమ జీవితం గడుపుతున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా షెఫాలీ.. ముజే షాదీ కరోగే సినిమాలో నటించింది. నాచ్‌ బలియే 5, 7 సీజన్స్‌లోనూ మెరిసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)