Breaking News

ది ఇండియా హౌస్‌తో ఎంట్రీ

Published on Tue, 02/03/2026 - 00:02

నిఖిల్‌ సిద్ధార్థ హీరోగా రూపొందుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘ది ఇండియా హౌస్‌’. రామ్‌ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్‌ కథానాయికగా, అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సమర్పణలో వి మెగా పిక్చర్స్, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై అభిషేక్‌ అగర్వాల్, విక్రమ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ కంపోజర్‌ శాశ్వత్‌ సచ్‌దేవ్‌ ‘ది ఇండియా హౌస్‌’ ద్వారా తెలుగులోకి అడుగుపెడుతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

‘‘ధురంధర్, ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్, ఆర్టికల్‌ 370’ చిత్రాలతో పాపులర్‌ అయిన శాశ్వత్‌ సచ్‌దేవ్‌ మా సినిమా ద్వారా టాలీవుడ్‌లో 
ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఐదు ఆకట్టుకునే పాటలను కంపోజ్‌ చేశారాయన. 1905 నాటి రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ‘ది ఇండియా హౌస్‌’ విప్లవం, ప్రేమ, త్యాగం.. వంటి భావోద్వేగాలో అద్భుతంగా ఉండబోతోంది. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: మయాంక్‌ సింఘానియా, కెమెరా: కేకే సెంథిల్‌ కుమార్‌.

Videos

జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ

అంబటి అల్లుడు,కూతురుని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్

ఎవర్ని వదిలిపెట్టం.. బైరెడ్డి వార్నింగ్

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ కు పాతర

మీకు దమ్ముంటే.. బాధితురాలి సంచలన సెల్ఫీ వీడియో..

Brahmaji : నావల్లే పూరి సినిమా ప్లాప్ అయ్యింది

Thanuja : ప్లీజ్ అలా అనడం మానేయండి.. నరకం అనుభవిస్తున్నా..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్ పోర్టులు

దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్

Vidadala: మాపై దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెట్టారు

Photos

+5

హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)

+5

'హనీ' ఈవెంట్‌లో అందంగా దివి (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్‌ ఈవెంట్‌ లో మెరిసిన హీరోయిన్‌ మానస వారణాసి (ఫొటోలు)

+5

నిర్మల్‌ : ఘనంగా ముజ్గి మల్లన్న జాతర (ఫొటోలు)

+5

’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ధనుష్‌ 55వ సినిమా.. శ్రీలీల, సాయి పల్లవి క్రేజీ ఫోటోలు

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)