Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
Breaking News
శర్వానంద్ బైకర్.. రిలీజ్‌కు ముందే ఫుల్ వీడియో సాంగ్
Published on Thu, 11/13/2025 - 21:45
చాలా రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బైకర్ మూవీ ఫస్ట్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రెట్టి బేబీ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు.
కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను జిబ్రాన్, యాజిన్ నైజర్, సుభ్లాషిణి ఆలపించారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ శర్వా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు.
Tags : 1