Breaking News

భారీ ధరకు డంకీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Thu, 12/21/2023 - 14:20

ఈ ఏడాది పఠాన్‌, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టి బాలీవుడ్ బాద్‌షా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ సినిమాతో ప్రేక్షకులను ముందుకొచ్చారు షారుక్ ఖాన్. గతంలో వీరిద్దరి కాంబోలో చాలా చిత్రాలు వచ్చాయి. దీంతో వీరి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిస్‌మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 21న ఈ చిత్రం రిలీజైంది. అయితే డంకీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 

అయితే అప్పుడే ఈ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అభిమాన హీరో సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అయితే డంకీ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.  కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్‌లో జియో స్టూడియోస్ ప్లాట్‌ఫామ్‌లో రానున్న సినిమాలు, సిరీస్‌ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్‌లో షారుక్ డంకీ సినిమా కూడా ఉంది. దీంతో డంకీ  జియో సినిమాలో స్ట్రీమింగ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇప్పటికే డంకీ చిత్రాన్ని జియో సినిమా రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక సినిమా టాక్‌ను బట్టి, కలెక్షన్స్ ఆధారంగా మేకర్స్ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు. సాధరణంగా థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తారని తెలిసిందే. అలాగే జరిగితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా డంకీని ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)