Breaking News

ఇంట్లోవాళ్లే అలాంటి మాటలన్నారు, ఎవరూ సపోర్ట్‌ చేయలేదు

Published on Sun, 03/17/2024 - 15:37

సీరియల్‌ నటి నుంచి హీరోయిన్‌గా మారింది భూమి శెట్టి. ఈ కన్నడ అందం 'షరతులు వర్తిస్తాయి' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ శుక్రవారం (మార్చి 15న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరోయిన్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మాది కర్ణాటక ప్రాంతం. మా ఇంట్లో ఇంజనీరింగ్‌ చేస్తానంటే ఒప్పుకోలేదు. నీకు ఇంజనీరింగ్‌ ఎందుకు? పెళ్లి చేసేస్తాం.. అన్నారు. లేదు, చదువు కొనసాగిస్తానంటే నాతో మాట్లాడటం మానేస్తామని బెదిరించారు.

ఆరేళ్లు మాట్లాడలేదు
అయినా సరే ఇంజనీరింగ్‌ చేస్తానని ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఆరేళ్లపాటు ఇంట్లోవాళ్లు నాతో మాట్లాడలేదు. ఓసారి నాకు సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. ఈ విషయం నేను వాట్సాప్‌ గ్రూపులో పంపిస్తే ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత నేను కన్నడ బిగ్‌బాస్‌కు వెళ్లాను. నన్నెలాగో మార్చలేమని అర్థమయ్యాక చివరికి నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. బాల్యంలో నా కలర్‌ గురించి చాలా మాటలన్నారు. బ్లాకీ అని, నల్లగా ఉన్నానని కామెంట్లు చేశారు. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలన్నా భయమేసేది.

ఎన్నో మాటలు పడ్డా
నువ్వు ఇంత నల్లగా ఉన్నావ్‌.. పెద్దయ్యాక నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ముఖానికి క్రీముల్లాంటివి పూసుకోమని.. తెల్లగా కనిపించాలని చెప్పేవారు. నేను యక్షగానం చేసే ఆర్టిస్టును. యక్షగానం చేసేటప్పుడు నాలుగు లేయర్ల మేకప్‌ వేస్తారు. పది లేయర్ల డ్రెస్సు వేసుకుంటాం. అంత కష్టపడితే మా ప్రతిభను గుర్తించి పొగిడేవారు కాదు. పైగా ముఖానికి అలా రంగు పూసుకోవడం వల్ల ఇంకా నల్లగా అవుతున్నానని ఎగతాళి చేసేవారు. అలా ఎన్నో మాటలు పడ్డాను. వాటన్నింటికీ అధిగమించాను' అని చెప్పుకొచ్చింది భూమి శెట్టి.

చదవండి: ఈ నటికి ఇంటిపేరు లేదు, ఇండస్ట్రీలో అది భరించలేక సినిమాలకు బ్రేక్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)