Breaking News

షణ్ముక్ సోదరుడి మరిన్ని ఆగడాలు.. బాధితులు చాలామందే

Published on Sat, 02/24/2024 - 18:27

యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ అలియాస్ షన్ను.. ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే ఓ అమ్మాయి.. షణ్ముక్ సోదరుడు సంపత్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఇంటికి వెళ్లారు. అక్కడ అనుకోని విధంగా గంజాయితో షణ్ముక్ పట్టుబడ్డాడు. అయితే ఈ కేసులో అనుహ్యంగా మరికొన్ని నిజాలు బయటకొస్తున్నాయి. చాలామంది అమ్మాయిలు షన్ను సోదరుడి వల్ల మోసపోయినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన షణ్ముక్ జస్వంత్‌కి సంపత్ అని అన్న ఉన్నాడు. అయితే ఇతడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన నమ్మించి మోసం చేయడంతో ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు వల్ల సంపత్ వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు బయటకు వస్తున్నారు.

సంపత్.. తన ఎంబీఏ క్లాస్‌మేట్ అయిన ఓ యువతి దగ్గర 2016లో థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెడదామని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నాడట. నెలకు రూ.7 వేలు లాభం మాత్రమే చూపించాడట. దీంతో మొత్తం డబ్బులు ఇచ్చేయమని అమ్మాయి అడగ్గా.. సంపత్ ఈమెని బ్లాక్ చేశాడట. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి ఆరు రోజులు ఉందనగా ఓ లేడీ డాక్టర్‌తో పెళ్లికి రెడీ అయ్యాడట. ముంబయిలో మరో యువతిని ఇప్పటికే సంపత్ పెళ్లి చేసుకున్నాడట. ఇలా సంపత్ బారిన పడి చాలామంది అమ్మాయిలు మోసపోయినట్లు, వీళ్లందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. 

(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?)

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)