Breaking News

ఛత్రపతి శివాజీ బయోపిక్‌ లేనట్లే.. ఇండస్ట్రీలో ఇంత దారుణమా?

Published on Wed, 07/23/2025 - 15:51

బయోపిక్‌లకు ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. అందుకు ఛావా సినిమానే నిదర్శనం. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అద్భుతాలు సృష్టించింది. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఛావా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్‌ నటప్రభంజనానికి ఫుల్‌ మార్కులు పడ్డాయి.

బయోపిక్‌ లేనట్లే?
అయితే ఛత్రపతి శివాజీరాజా బయోపిక్‌ (Chhatrapati Shivaji Biopic) కూడా వస్తోందంటూ అప్పట్లో ఓ ప్రకటన వచ్చింది. ప్రముఖ దర్శకుడు అమిత్‌ రాయ్‌.. షాహిద్‌ కపూర్‌ను శివాజీగా చూపించనున్నాడని ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ ఈ మూవీ అటకెక్కిందట! ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా వెల్లడించాడు. అమిత్‌ రాయ్‌ మాట్లాడుతూ.. సిస్టమ్‌ చాలా దారుణంగా ఉంది. నేను డైరెక్ట్‌ చేసిన ఓమైగాడ్‌ 2 మూవీ రూ.180 కోట్లు సాధించింది. 

ఎలా పనిచేస్తా?
అయినప్పటికీ.. నా పనితనం నిరూపించుకోవడానికి ఇది సరిపోదట! నటీనటుల ఎంపిక, ప్రొడక్షన్‌, మేనేజ్‌మెంట్‌.. ఇలాంటి వ్యవస్థల కింద నలుగుతూ ఒక దర్శకుడు ఎలా పని చేయగలడు? ఐదేళ్ల జీవితాన్ని ఒక కథకు అంకితం చేస్తే.. కొందరు సడన్‌గా వచ్చి అందులో ఇది తప్పు, అది తప్పు అని ప్రతిదానికి వంకపెడితే ఎంత బాధగా అనిపిస్తుంది అంటూ ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేసినట్లు చెప్పకనే చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. కొందరు హీరోలు కేవలం బాక్సాఫీస్‌ లెక్కల్నే చూస్తారు. 

హీరోలకు లవ్‌స్టోరీలే కావాలి
మరికొందరు మాత్రం నిజాయితీగా కథల్ని మాత్రమే నమ్ముతారు. కానీ, చాలామంది సమాజంలోని చేదు నిజాలను కళ్లకు కట్టినట్లు చూపించే సినిమాల్లో భాగమవడానికి బదులుగా ప్రేమకథా చిత్రాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అని చెప్పుకొచ్చాడు. అమిత్‌ రాయ్‌ ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌, పంకజ్‌ త్రిపాఠితో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్‌ కపూర్‌ విషయానికి వస్తే.. ఈయన చివరగా దేవా చిత్రంతో డిజాస్టర్‌ అందుకున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్‌ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రాణించలేకపోయింది.

చదవండి: మంచు లక్ష్మి గొప్ప మనసు.. అన్నింటికంటే ఆ దానమే

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)