మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
నయనతార బాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..
Published on Sat, 06/26/2021 - 09:06
ప్రస్తుతం ‘పఠాన్’ సినిమాతో బిజీగా ఉన్న బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ త్వరలో దక్షిణాది దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అట్లీ చెప్పిన ఫైనల్ కథకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై ఫోకస్ పెట్టారని టాక్. ఈ ప్రక్రియలో భాగంగానే తన దర్శకత్వంలో వచ్చిన ‘రాజా– రాణి’ (2013), ‘బిగిల్’ (2019) చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార పేరును పరిశీలిస్తున్నారట అట్లీ.
ఆల్రెడీ నయనతారతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే పదిహేనేళ్లుగా సౌత్‌లో అగ్ర కథనాయికగా రాణిస్తున్న నయనతార ఇంతవరకూ హిందీ సినిమా చేయలేదు. మరి.. షారుక్‌తో నయనతార జోడీ కడతారా? హిందీ సినిమాకు నయనతార సైన్ చేస్తారా? వేచి చూడాల్సిందే.
చదవండి: నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్
Tags : 1