Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
సల్మాన్ బర్త్‌డే పార్టీకి హాజరైన షారుక్‌ఖాన్.. ఫోటోలు వైరల్
Published on Tue, 12/27/2022 - 11:44
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ 57వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా ఆయన సోదరి అర్పితా ఖాన్ గతరాత్రి తన నివాసంలో గ్రాండ్‌గా సల్మాన్ బర్త్‌డే పార్టీ నిర్వహించింది. ఈ వేడుకల్లో బాద్‌షా షారుక్ ఖాన్ సందడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఫోటోలను ఫోజులిచ్చారు. సల్మాన్-షారుక్‌ను ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ తెగ సండర పడిపోతున్నారు.
ఇక ఈ పార్టీకి జాన్వీకపూర్,పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్‌ఆర్యన్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాగా మైనే ప్యార్ కియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ ఆ తర్వాత హమ్ ఆప్కే హై కౌన్,బీవీ నెం.1, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలతో స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు హోస్ట్ గానూ కొనసాగుతున్నారు.
The way they hug each other , there is so much love & brotherhood ♥️#HappyBirthdaySalmanKhan pic.twitter.com/JTfXYZXhMa
— Shah Rukh Khan Fc - Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) December 27, 2022
Tags : 1