Breaking News

భారీ బడ్జెట్‌తో షారుక్‌- సల్మాన్‌ సినిమా.. గెస్ట్‌ రోల్స్‌లో ఎన్టీఆర్‌, హృతిక్‌!

Published on Wed, 06/11/2025 - 12:02

వైఆర్‌ఎఫ్‌ (యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌) స్పై యూని వర్స్‌లో భాగంగా ఇప్పటివరకు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా చేసిన ‘ఏక్తా టైగర్‌’ (2012), ‘టైగర్‌ జిందా హై’ (2017), ‘టైగర్‌ 3’ (2023), హృతిక్‌ రోషన్‌ ‘వార్‌’ (2019), షారుక్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ (2023) వంటి సినిమాలు సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఈ యూనివర్స్‌లోనే హృతిక్‌ రోషన్‌ – ఎన్టీఆర్‌ హీరోలుగా చేసిన ‘వార్‌ 2’, ఆలియా భట్‌ – శర్వారీ లీడ్‌ రోల్స్‌ చేసిన ‘ఆల్ఫా’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమౌతున్నాయి. ‘వార్‌ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ‘ఆల్ఫా’ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 25న విడుదల కానుంది. 

కాగా... రెండు సంవత్సరాలుగా ఈ ‘వైఆర్‌ఎఫ్‌’ స్పై యూనివర్స్‌లో భాగంగానే ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’(Pathaan Vs Tiger)చిత్రం రానుందని, ఈ మూవీలో షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ హీరోలుగా చేస్తారని, అలాగే ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’ సినిమాలో ఈ యూనివర్స్‌లో భాగమైన హృతిక్‌ రోషన్, జాన్‌ అబ్రహాం, ఆలియా భట్, ఎన్టీఆర్‌ గెస్ట్‌ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాని ‘వార్, పఠాన్‌’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. 

దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ హఠాత్తుగా ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’ చిత్రం ఆగిపోయిందనే టాక్‌ తెరపైకి వచ్చింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ‘వార్‌ 2’, ‘ఆల్ఫా’ చిత్రాలు విడుదలైన తర్వాత ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’ సినిమా గురించి ఓ స్పష్టత వస్తుందని జాతీయ ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సిల్వర్‌ స్క్రీన్‌పై ‘పఠాన్‌–టైగర్‌’ల పోరు ఉంటుందని, కాకపోతే కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)