Breaking News

ఆరోజు జరిగినదానికి సినిమాలే మానేద్దామనుకున్నా, రోడ్డుపై ఏడుస్తూ..

Published on Sun, 07/30/2023 - 13:51

రెండు రోజుల క్రితం రిలీజైన బాలీవుడ్‌ సినిమా రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానిలో ఓ సీన్‌ సెన్సేషనల్‌ అవుతోంది. 87 ఏళ్ల వయసున్న స్టార్‌ నటుడు ధర్మేంద్ర, 72 ఏళ్ల వయసున్న నటి షబానా అజ్మీ లిప్‌లాక్‌ సీన్‌లో నటించారు. ఇది సినీప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. అయితే నటనపరంగా అదేమీ తప్పు కాదని వెనకేసుకొస్తున్నారీ సీనియర్‌ స్టార్స్‌. తాజాగా షబానా అజ్మీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

చప్పట్లే అని చెప్పి తీరా సమయానికి
'పర్వరీశ్‌ సినిమా సమయంలో జరిగిన సంఘటన ఇది.. కమల్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌.. రిహార్సల్స్‌ చేద్దామని నేను, అవసరం లేదని ఆయన.. నువ్వు జస్ట్‌ చప్పట్లు కొడితే సరిపోతుందన్నాడు. బెరుకుగానే సరేనన్నాను. తీరా సెట్‌లోకి వెళ్లాక రెండు చేతులతో రెండు తుపాకీలు పట్టుకుని డ్యాన్స్‌ చేయమన్నారు. నాకు చాలా భయమేసింది. ఎందుకంటే అప్పటికే నీతూ సింగ్‌ రెండుసార్లు ప్రాక్టీస్‌ చేసి వచ్చింది. నేనేమో చేయలేదాయే! ఏ స్టెప్పుకు ఏ కాలు ముందు వేయాలి? ఏ కాలు వెనక్కు వేయాలి? అనేది అర్థమవక అయోమయానికి లోనయ్యాను.

అందరిముందు ఎగతాళి
మరీ కఠినమైన స్టెప్పులు కాకుండా సులువైన స్టెప్పులు చెప్పమని అడిగాను. అందుకా కొరియోగ్రాఫర్‌.. సరే, లైట్స్‌ ఆఫ్‌ చేయండి.. ఇప్పుడు నాకు షబానా గారే స్టెప్స్‌ నేర్పిస్తారు అని వెటకారం చేశాడు. అక్కడ సెట్‌లో చాలామంది జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లందరి ముందు నన్ను ఎగతాళి చేశాడు. చాలా బాధేసింది. సెట్‌లో నుంచి ఉన్నపళంగా వెళ్లిపోయాను. కాస్ట్యూమ్‌ కూడా మార్చుకోకుండానే బయటకు వెళ్లి నా కారు కోసం వెతికాను. కారు కనిపించకపోవడంతో జుహూలో ఉన్న నా ఇంటికి నడిరోడ్డుపై ఏడ్చుకుంటూ కాలినడకన వెళ్లిపోయాను.

సినిమాలు మానేద్దామనుకున్నా
ఇక మీదట ఏ హిందీ సినిమాలోనూ నటించకూడదనుకున్నాను. ఇంతటి అవమానాన్ని భరించడం నా వల్ల కాదు. ఈ అవమానాలు నేను పడలేను అని బాధపడుతూ నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. కానీ ఆ తర్వాత డైరెక్టర్‌ మన్మోహన్‌ దేశాయ్‌ జరిగిన సంఘటనకు బాధ్యత వహిస్తూ సారీ చెప్పాడు. అయినా సరే ఇప్పటికీ డ్యాన్స్‌ చేయాలంటే నాకు అదే సంఘటన గుర్తొచ్చి ఎంతో అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. టెన్షన్‌, భయం ఏకకాలంలో వస్తాయి' అని చెప్పుకొచ్చింది షబానా. కాగా పర్వరీశ్‌ చిత్రం 1977లో విడుదలైంది. ఇందులో షబానా అజ్మీతో పాటు అమితాబ్‌ బచ్చన్‌, నీతూ సింగ్‌, షమ్మీ కపూర్‌, వినోద్‌ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

చదవండి: పెళ్లయిన 18 ఏళ్లకు బాలీవుడ్‌ నటుడు విడాకులు
తొమ్మిదో నెల గర్భంతో లహరి.. మరికొద్దిరోజుల్లో డెలివరీ

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)