Breaking News

Adipurush Mistakes: ఆదిపురుష్ మూవీ.. ఓం రౌత్ చేసిన అతిపెద్ద బ్లండర్స్ ఇవే!

Published on Tue, 06/20/2023 - 21:37

ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం 'ఆదిపురుష్‌'. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శల దాడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సినిమాలోని పలు అంశాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డైలాగ్స్, పాత్రల వేషధారణపై పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. సినిమా టీజర్‌ రిలీజైనప్పటి నుంచి సినిమా విడుదలైన  తర్వాత కూడా ఆదిపురుష్‌పై విమర్శల దాడి ఆగడం లేదు. ‍‍అసలు మీరు రామాయణమే కాదంటూ నెటిజన్స్‌తో పాటు కొందరు నటీనటులు సైతం విమర్శిస్తున్నారు.

(ఇది చదవండి: ఆదిపురుష్‌ మూవీ ఓ పెద్ద జోక్‌.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు )

ఇవన్నీ పక్కనబెడితే దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు ఏంటి? అసలు ఎక్కడ ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలమయ్యారు. రామాయణంలో పాత్రలకు ఆధునిక సాంకేతికతను జోడించడం సినిమాను దెబ్బతీసిందా? లేక పాత్రలను తీర్చిదిద్దడంలో.. వాస్తవాన్ని చూపించడంలో విఫలమయ్యారా? అనేది ఓ సారి పరిశీలిద్దాం. ఆదిపురుష్‌పై ఇంతలా విమర్శలు రావడానికి ప్రధాన కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ జూన్ 16న  సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలకు గురైంది.

విమర్శలకు దారితీసిన ప్రధాన తప్పిదాలివే!


1. రావణుడికి ఉన్న పది తలలపై ప్రేక్షకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. అంతే కాకుండా రావణుడి కేశాలంకరణ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలి ఉందని కామెంట్స్ చేశారు.

2. సినిమాలోని హనుమంతునిపై రాసిన డైలాగులు ప్రేక్షకులను, విమర్శకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే డైలాగ్స్‌ను మారుస్తామని నిర్మాతలు ప్రకటించారు.

3.పుష్పక విమానంలో రావణుడు సీతను అపహరిస్తాడు. కానీ.. ఆదిపురుష్‌లో మాత్రం నల్లటి గబ్బిలం లాంటి పక్షిపై రావణుడు కనిపించాడు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. 

4. సీత పాత్రలో కృతి సనన్ పలు రకాల రంగుల దుస్తులు ధరించింది. కానీ ఇతిహాసమైన రామాయణంలో రాముడు,  సీత అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఆ సమయంలో కేవలం కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించారు.

5. డైలాగ్స్ పక్కన పెడితే చిత్రనిర్మాతలు రాఘవ అని కూడా పిలువబడే రాముడిని కోపంగా, మరింత దూకుడుగా ఉండే వ్యక్తిగా ఆదిపురుష్‌లో చూపించారు. ఇది కూడా సినిమాకు ఓ పెద్ద మైనస్ అనే చెప్పాలి.

6. పురాణాల ప్రకారం రావణుడి లంక బంగారు వర్ణంతో నిండి ఉంది. అయితే ఓం రౌత్ లంకను ఈ చిత్రంలో నలుపు, తెలుపులో చిత్రీకరించినందుకు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. 

7.  ఇంద్రజిత్ పాత్రలో మేఘనాథ్‌కు చాలా టాటూలు వేయించుకున్నట్లు చూపించారు. దీంతో నెట్టిజన్స్ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారు.

(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!)

ఇలాంటి పొరపాట్లతో ఆదిపురుష్ టీం ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకుంది. వాస్తవానికి భిన్నంగా పాత్రలను చూపించిన ఓం రౌత్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఏదేమైనా పురాణ ఇతిహాసాలను తెరపై చూపించాలంటే వాస్తవాలను మరో కోణంలో చూపిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని తెలుస్తోంది. రామాయణం ఆధారంగా రాబోయే సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతారని ఆశిద్దాం. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)