Breaking News

మైనర్‌ను పెళ్లి చేసుకున్నా.. 16 ఏళ్లకే పిల్లలు: సీరియల్‌ నటుడు

Published on Sun, 08/03/2025 - 16:28

అలౌకిక, పద్మవ్యూహం, ఎండమావులు.. ఇలా ఎన్నో హిట్‌ సీరియల్స్‌లో నటించాడు ఇంద్రనాగ్‌ (Indra Nag). తర్వాతేమైందే ఏమో కానీ నెమ్మదిగా బుల్లితెరకు దూరమైపోయాడు. చాలాకాలం తర్వాత ఇంద్ర నాగ్‌ కెమెరా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ప్రభాకర్‌తో ఉన్న గొడవల గురించి, ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం గురించి మాట్లాడాడు.

రెమ్యునరేషన్‌
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంద్రనాగ్‌ మాట్లాడుతూ.. నా అసలు పేరు నాగేంద్ర. మాది తూర్పు గోదావరి. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. కన్నడలో సినిమా ఆఫర్లు వస్తే భాష కష్టంగా ఉందని చేయనని చెప్పేశాను. 23 ఏళ్లకే పెళ్లి పీటలెక్కాను. చిన్నమామయ్య కూతురినే పెళ్లి చేసుకున్నా.. మాకు పాప పుట్టేనాటికి నా భార్య వయసు 16 ఏళ్లే! 24వ ఏట ఇండస్ట్రీలోకి వచ్చాను. కెరీర్‌ తొలినాళ్లలో నటుడిగా రోజుకు రూ.1500 పారితోషికం ఇచ్చేవారు. దర్శకత్వం చేసేటప్పుడు రోజుకు రూ.15 వేలు తీసుకున్నాను.

ప్రభాకర్‌తో గొడవ?
ప్రభాకర్‌ నాకంటే సీనియర్‌. తను మొదటినుంచీ నాతో ఎక్కువగా మాట్లాడడు. నేను మాత్రం ఆయన్ను గౌరవిస్తాను. మా మధ్య ప్రత్యేకంగా గొడవలేమీ లేవు. కానీ ఆయనకు నామీద కోపం ఉందని తన ఇంటర్వ్యూ చూశాక తెలిసింది. దానికి నేనేం చేయలేను. ఆ విషయాన్ని లైట్‌ తీసుకున్నాను. కరోనా తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కొంత డిప్రెషన్‌గా అనిపిస్తోంది. ప్రతిదానికి లోతుగా ఆలోచిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇంద్రనాగ్‌.. తెలుగులో నాన్‌స్టాప్‌ మూవీలో హీరోగా నటించాడు. ప్రస్తుతం నిండు మనసులు సీరియల్‌ చేస్తున్నాడు.

చదవండి: మా జీవితంలోకి అమ్మవారు వచ్చిన రోజు.. ఘనంగా కూతురి ఫస్ట్‌ బర్త్‌డే

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)