Breaking News

ఆమె నా కూతురు కాదంటూ బాంబు పేల్చిన స్టార్‌ హీరోయిన్‌

Published on Mon, 05/27/2024 - 10:54

సుకన్య.. ఒకప్పుడు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌. తమిళంలోనే కాకుండా, మలయాళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. ఒకప్పుడు ఎంతో ఫేమ్‌ అందుకున్న ఈ బ్యూటీ కొంతకాలంగా మాత్రం వెండితెరపై కనిపించడమే లేదు. అయితే, సుకన్య కూతురు అంటూ ఒక యువతి ఫోటో నెట్టంట వైరల్‌ అవుతుంది. పెళ్లి అయిన కొన్ని నెలలకే  భర్తతో విడిపోయిన సుకన్యకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ అంశం గురించి సుకన్య రియాక్ట్‌ అయింది.

కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో అనుకున్నట్లు ఆ అమ్మాయి తన కూతురు కాదని సుకన్య ఇలా చెప్పింది. 'నేను కూడా ఆ ఫోటో చూశాను. అది నా కూతురు కాదు. ఆమె నా చెల్లెలి కూతురు. ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెప్పాను. అంతేకాదు, ఆమె నా సోదరి కుమార్తె అని కూడా పేర్కొన్నాను. కానీ అది నా కూతురిలా నెట్టింట వైరల్ అయింది. నా వివాహం అయిన కొన్ని నెలల్లోనే విడాకులతో ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. 

మేము కొన్ని నెలలు మాత్రమే కలిసి ఉన్నాము. ఆ తర్వాత కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ విడాకులు తీసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అయితే, ఫన్నీగా నా సోదరి కూతురు ఫోటోను షేర్‌ చేస్తూ నా కుమార్తె అంటూ ప్రచారం చేస్తున్నారు. నా చెల్లెలు కూతురు కూడా ఈ వార్త చూసి, పెద్దమ్మ వల్ల నాకు కూడా గుర్తింపు వచ్చిందని సంతోషంగా వాళ్ల ఇంట్లో చెబుతుంది.' అని సుకన్య తెలిపింది.

1991లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన 'పుదు నెల్లు పుదు నాత్తు' అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి సుకన్య అడుగుపెట్టింది. అక్కడ మహానది, భారతీయుడు వంటి చిత్రాల్లో మెప్పించిన ఆమె తెలుగులో సాంబ, పెద్దరికం,మున్నా, శ్రీమంతుడు వంటి సినిమాల్లో మెప్పించింది. అయితే తనకు అవకాశాలు రాకనే సినిమాల్లో నటించడం లేదని ఆమె తెలిపింది. ఎవరైన మంచి ఛాన్స్‌లు ఇస్తే మళ్లీ నటిస్తానని సుకన్య పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)