Breaking News

పద్మ విభూషణ్ గ్రహీత, సీనియర్‌ నటిపై మరణ వార్తలు.. కుమారుడు క్లారిటీ

Published on Fri, 03/07/2025 - 17:40

అలనాటి నటి, పద్మ విభూషణ్ వైజయంతి మాల పలు సూపర్ హిట్‌ సినిమాల్లో నటించారు. 1955లో బాలీవుడ్‌లో దిలీప్ కుమార్ నటించిన దేవదాస్ చిత్రం హీరోయిన్‌గా కనిపించారు. అంతేకాకుండా నయా దౌర్, మధుమతి, జ్యువెల్ థీఫ్, సంగం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు గానూ పద్మ శ్రీ, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా ఆమెను అభిమానులు ముద్దుగా డ్యాన్సింగ్ క్వీన్‌ అని పిలుచుకుంటారు.

తాజాగా ఈ సీనియర్ నటి వైజయంతిమాల చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలయ్యాయి. దీంతో ఆమె కుమారుడు స్పందించారు. ఆమె మరణించారన్న వార్తలను వైజయంతిమాల కుమారుడు సుచింద్ర బాలి ఖండించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. ఆమె మరణ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఆమె వయస్సు 91 ఏళ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.

d

డాక్టర్ వైజయంతిమాల బాలి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆ వార్తలు షేర్ చేసే ముందు ఒకసారి ధృవీకరించుకోవాలని ఆమె కుమారుడు సుచింద్ర బాలి హితవు పలికారు. కాగా.. ఇటీవలే జనవరిలో చెన్నైలోని కళా ప్రదర్శినిలో వైజయంతిమాల భరతనాట్యం ప్రదర్శించారు. ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. వైజయంతిమాల తన నటనకు గాను పద్మభూషణ్ అవార్డ్‌ను దక్కించుకుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)