Breaking News

హీరోయిన్‌గా ఊర్వశి కూతురు 'తేజలక్ష్మి'.. మొదటి సినిమా ఇదే

Published on Sun, 06/15/2025 - 11:15

నటి ఊర్వశి వారసురాలు హీరోయిన్‌గా రంగప్రవేశం చేశారు. అమ్మ పాత్రలకు, అమాయకపు రోల్స్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వించగల పాత్రలకు పెట్టింది పేరు ఊర్వశి. ఈమె అసలు పేరు కవిత రంజిని. కేరళలో పుట్టి పెరిగిన ఈమె చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. ముందనై ముడిచ్చు అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా మారింది. కొంతకాలంపాటు హీరోయిన్‌గా నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 700కు పైగా చిత్రాలు చేసింది.

ఊర్వశి ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చింది. అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కుమార్తె 'తేజ లక్ష్మి' సినీ ఎంట్రీ ఉంటుందని ప్రకటించింది. ఆమె చెప్పినట్లుగానే తాజాగా తన మాతృభాష మలయాళీ ఇండస్ట్రీలో తేజ లక్ష్మి అడుగుపెట్టింది. నటి ఊర్వశి, నటుడు మనోజ్ జయన్‌ను ప్రేమించి 2000లో పెళ్లి చేసుకుంది. వారిద్దరికి జన్మించిన అమ్మాయే తేజ లక్ష్మి. ఆ తర్వాత మనోజ్‌తో విభేదాలు రావడంతో అతడితో విడాకులు తీసుకుని 2013లో శివ ప్రసాద్‌ని పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. కానీ తేజలక్ష్మి మాత్రం తన తండ్రితోనే కలిసి ఉంటోంది.

మలయాళంలో 'సుందరియాయవల్‌ స్టెల్లా' అనే చిత్రంలో కథానాయికగా తేజ లక్ష్మి నటిస్తుంది.  నటుడు మనోజ్‌ కే.విజయన్‌ తన కూతురు కథానాయకిగా ఎంట్రీ గురించి ఒక భేటీలో ఇలా మాట్లాడారు.  'తేజలక్ష్మికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నట్లు మొదట నా  రెండో భార్య నాకు చెప్పింది. దీంతో వెంటనే నా కూతురికి ఒక సలహా ఇచ్చాను.  ముందు మీ అమ్మ ఊర్వశికి చెప్పి  ఆశీస్సులు తీసుకోమని పంపాను. అలాగే ఊర్వశి కూడా ఆమెను మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఊర్వశి సమ్మతించకపోతే తేజలక్ష్మి కథానాయకి అయ్యేదే కాదు. ముందుగా మాతృభాషలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన తేజలక్ష్మి తరువాత తమిళం, తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తుంది.' అని ఆయన అన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)