Breaking News

తినడానికి తిండి లేక మంగళసూత్రం అమ్మాల్సి వచ్చింది: నటి

Published on Mon, 01/09/2023 - 18:53

దాదాపు వెయ్యి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సీనియర్‌ నటి సుధ. బాలనటిగా, హీరోయిన్‌గా, అత్తగా, అమ్మగా, వదినగా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయిన ఆమె జీవితంలో మాత్రం ఎన్నో కష్టనష్టాలను చవిచూసింది. దీని గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను డైమండ్‌ స్పూన్‌తో పుట్టాను. పెద్ద ఇల్లు, ఇంటినిండా పనివాళ్లు, ముగ్గురు డ్రైవర్లు.. ఇలా చాలా రాజసంగా బతికాం.

మా నాన్నకు నలుగురు కొడుకుల తర్వాత నేను పుట్టాను. అందుకే నాకు అమృతం అన్న అర్థం వచ్చేలా సుధ అని పేరు పెట్టారు. ఇంట్లో 20 తులాల బంగారు నగలు వేసుకుని తిరిగేదాన్ని. ఆస్తి, ఐశ్వర్యం అన్నీ చూశాను. కానీ తమ్ముడు పుట్టిన కొంతకాలానికే నాన్నకు క్యాన్సర్‌ అని తెలిసింది. అప్పటినుంచి ఆస్తి అంతా కరిగిపోవడం మొదలైంది. నేను ఆరో తరగతి చదివే సమయంలో అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది. అలా అన్నీ ఉన్న స్టేజ్‌ నుంచి ఏమీ లేని స్థాయికి వచ్చాం.

అమ్మ థియేటర్‌ ఆర్టిస్ట్‌ కావడంతో నన్ను కూడా యాక్టింగ్‌ ఫీల్డ్‌కు తీసుకొచ్చింది. డబ్బు, పేరు రావడంతో చుట్టాలు తిరిగి మావంక చూడటం మొదలుపెట్టారు. చిన్నతనంలో సుఖసంతోషాలతో పాటు ఎన్నో కష్టాలు పడ్డాము. ఆ మధ్య ఢిల్లీలో హోటల్‌ ప్రారంభించడంతో ఉన్న డబ్బంతా పోయింది. ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయాను. ఇంకా కొన్ని అప్పులైతే ఇప్పుడిప్పుడే వాటినుంచి బయటపడ్డాను. నా కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైపోయాడు. నాతో గొడవపడి వెళ్లిపోయాడు. ఇప్పటికీ మాట్లాడట్లేదు' అని చెప్తూ ఎమోషనలైంది సుధ.

చదవండి: రాకీ భాయ్‌ స్థానంలో వేరే హీరో.. షాకిచ్చిన నిర్మాత
తమ్ముడి బర్త్‌డే పార్టీలో శ్రీముఖి రచ్చ

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)