Breaking News

రెండో భర్త మరణం.. 23 ఏళ్లకే నా జీవితం ముగిసిపోయింది: నటి

Published on Sat, 07/15/2023 - 21:40

'వద్దు బావ తప్పు' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది నటి ప్రమీలా రాణి. వేద, బాహుబలి వంటి పలు చిత్రాల్లో తన నటనతో అందరినీ మంత్రముగ్దులు చేసిన ఆమె సహజ నటిగా పేరు తెచ్చుకుంది. ఏడుపు సన్నివేశాల్లో కూడా గ్లిజరిన్‌ లేకుండా అతి సాధారణంగా నటించగల సామర్థ్యం ఆమెది. అందుకే ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ నటిగా రాణిస్తోంది. 85కు పైగా సినిమాలు చేసిన బామ్మ తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టింది.

'నేను 107 ఎకరాల ఆసామికి పుట్టాను. కానీ పెళ్లి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు ఇస్నోఫియా అనే జబ్బు ఉండేది. మబ్బు పట్టినప్పుడు ఆయాసం వచ్చేది. 1997 నుంచే షుగర్‌ కూడా ఉంది. ఈ జబ్బులతో ఎలాగోలా నెట్టుకొస్తున్నాను. పెళ్లి చేసుకున్నాక భరతనాట్యం చేసేదాన్ని. పలు స్టేజీపై నృత్యం చేసేదాన్ని. అయితే పెళ్లైన కొత్తలో నాకు పిల్లలు పుట్టరని చెప్పడంతో నా భర్త విడాకులిచ్చాడు. మేము ఇచ్చిన డబ్బు కూడా తిరిగిచ్చేశాడు.

ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాను. కానీ అప్పటికే అతడికి పెళ్లైంది. ఆ విషయం దాచి నన్ను మోసం చేశాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పారు.. కానీ నెల తప్పాను. 8వ నెలలో రైల్వే ఆస్పత్రికి చెకప్‌ కోసం వెళ్తే..నీకు గర్భం లేదు ఏం లేదని డాక్టర్‌ కసురుకుంది. తర్వాత రెండు నెలలకే ఓ ఆస్పత్రిలో నిండు పౌర్ణమినాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాత పాప, కొడుకు పుట్టారు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు.

1986 మార్చి 26న భర్త చనిపోయాడు. 23 ఏళ్లకే భర్త చనిపోవడంతో జీవితం ముగిసిపోయినట్లనిపించింది. నాటకాలు వేస్తూ, సినిమాలు చేస్తూ కొద్దికొద్దిగా సంపాదించడం మొదలుపెట్టాను. అలా తక్కువకాలంలోనే అందరి నోట్లో నాలుకలా మారిపోయాను. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, నటి విజయరాణి నాకు స్నేహితురాలు. నా దగ్గర రూ.15 లక్షలు తీసుకుంది. ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. అలా ఆమెకు డబ్బులిచ్చి మోసపోయాను' అని చెప్పుకొచ్చింది.

చదవండి: అందుకే సినిమాలకు దూరమయ్యాను: హీరోయిన్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)