Breaking News

ప్రకాశ్‌రాజ్‌ భార్యగా ఛాన్స్‌... ఐదుగురితో కాంప్రమైజ్‌!

Published on Sun, 11/30/2025 - 10:31

అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోంది మాధవి. మిర్చి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల సీరియల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదని, వచ్చినా కమిట్మెంట్‌ అడుగుతున్నారని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి మాట్లాడింది.

లావుగా ఉన్నానని..
'అన్నీ ఉన్నా ఆఫర్స్‌ రావటంలేదు. ఆడిషన్స్‌కు వెళ్తేనేమో మీరా మాధవిగారు.. మీరు తెలుసు అనేస్తారు. సీరియల్స్‌లో అయితే డిమాండ్‌ ఉంది. సినిమాల్లోనే.. పిలుస్తున్నారు కానీ ఫైనల్‌ చేయడం లేదు. కొన్నిసార్లు లావుగా ఉన్నానని రిజెక్ట్‌ చేస్తారు. ఆడవారికి ఒక వయసు దాటాక హార్మోన్ల సమస్యలు వస్తాయి.. లావైపోతాం. దానికి మనమేం చేయలేం.. మరి వీళ్లంతా నేను సన్నగా ఉన్నప్పుడు ఏం చేశారో..?

ఇంటికి వచ్చి మరీ..
12 ఏళ్ల క్రితం ఒక దర్శకుడు ఫోన్‌ చేశాడు. తనింకా ఆఫీస్‌ పెట్టలేదని, ఇంటికొచ్చి మాట్లాడతానన్నాడు. నేను ఉత్సాహంతో సరే, రండి సర్‌ అన్నాను. అప్పుడు ఇంట్లో అమ్మ, నేను, పనిమనిషి ఉన్నాం. ఆయన వచ్చాక నన్నోసారి నడవమన్నారు. ఆడిషన్‌ చేస్తున్నారేమోనని నడిచి చూపించాను. అప్పుడు డ్రెస్‌లో ఉండేసరికి చీర కట్టుకుని రమ్మన్నాడు. సరే అని చీర కట్టుకుని రెడీ అయి ముందు నిల్చున్నాను. 

చెప్పు తీసుకుని కొడతా..
ఆయన నన్ను ఎగాదిగా చూసి కాస్త నీ నడుము చూపించు అన్నాడు. వెంటనే కోపంతో నువ్వు లేరా.. చెప్పు తీసుకుని కొడతా, బయటకు పో అని గెంటేశాను. ఒకవేళ ఆయన తలుపేసి ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటి? అని నిలువెల్లా వణికిపోయాను. మరో సంఘటన.. 100% లవ్‌ సినిమా చేశాక నాకో ఫోన్‌ కాల్‌ వచ్చింది. ప్రకాశ్‌రాజ్‌ పక్కన భార్య పాత్ర.. ఐదుగురితో కాంప్రమైజ్‌ కావాలి అని అడిగారు. 

ఆ టైప్‌ కాదన్నాను
100% లవ్‌లో కూడా కాంప్రమైజ్‌ ఇచ్చారని మాకు తెలిసింది అన్నాడు. అలాంటిదేమీ లేదు, కావాలంటే వాళ్లను అడగండి అని చెప్పాను. అలాంటి మార్గం ఎంచుకుంటే అదే పని చేసుకునేదాన్ని.. నేనలా కాదు, సారీ అని చెప్పాను. మంచి అవకాశం అని బలవంతం చేశారు, కానీ నేను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. మాధవి (Mirchi Madhavi) చివరగా గుప్పెడంత మనసు సీరియల్‌లో మెప్పించింది. ప్రస్తుతం గోపీచంద్‌ సినిమాతో పాటు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ చేస్తోంది

చదవండి: OTT: గుల్మొహర్‌ మూవీ రివ్యూ

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)