Breaking News

ఓ హీరో కమిట్‌మెంట్‌ అడిగితే.. నా చెప్పుల సైజు 41 అని చెప్పా: ఖుష్బు సుందర్

Published on Fri, 11/22/2024 - 13:56

సీనియర్ నటి ఖుష్బు సుందర్‌ ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్‌ఎఫ్‌ఐ)-2024 వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అనే సదస్సులో ఆమె పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రతపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఖుష్బు సుందర్ మాట్లాడుతూ..' మహిళలపై వేధింపులు కేవలం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు. అన్ని చోట్లా ఉన్నాయి. బస్సులో, ట్రైన్‌లో, ఆటోల్లో కూడా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ సినిమా సెట్‌లో హీరో నాతో అసభ్యంగా మాట్లాడారు. మాకు ఏదైనా ఛాన్స్‌ ఉందా? అని నాతో అన్నాడు. అప్పుడు వెంటనే నేను నా చెప్పుల సైజు 41. షూటింగ్‌ సెట్‌లోనే అందరిముందు చెంప పగలకొట్టనా? అని వార్నింగ్ ఇచ్చా' అని అన్నారు.

కాగా.. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో మహిళల వేధింపులపై మాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చాలామంది తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటికి చెప్పారు. పలువురు నటులపై ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదయ్యాయి.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)