Breaking News

జయసుధ సోదరి కూతురు నటి అని తెలుసా.. ఏ చిత్రంలో చేసిందంటే?

Published on Wed, 06/28/2023 - 18:54

సీనియర్ హీరోయిన్ జయసుధ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. 1990లోనే అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తనదైన నటనతో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 

1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించిన జయసుధ మాతృభాష తెలుగే. జయసుధ దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ, కన్నడ చిత్రాల్లోను నటించారు. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి. ఆమె ఎక్కువగా రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు చిత్రాల్లో కనిపించారు. ఈ ఏడాది వారసుడు, మళ్లీ పెళ్లి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాల్లో నటించారు. 

(ఇది చదవండి: పెళ్లై కొన్ని నెలలైనా కాలేదు.. అప్పుడే విడాకులా..!)

తెలుగులో స్టార్‌ నటిగా ఓ వెలుగు వెలిగిన జయసుధకు ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె కూడా నటి అన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమెకు జయసుధలా వెండితెరపై అంతలా రాణించలేకపోయింది. జయసుధ సోదరి సుభాషిణి మొదట బుల్లితెర పై నాగాస్త్రం, సుందరకాండ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత సీతయ్య’ ‘అరుంధతి’ వంటి పెద్ద సినిమాల్లో నటించినా ఆమెకు గుర్తింపు దక్కలేదు. ఆమె దాదాపుగా 12 చిత్రాల్లో కనిపించారు. ఇక ఆమెతో పాటు కూతురు కూడా సినిమాల్లో అడుగుపెట్టింది. కానీ అమ్మలాగే కూతురికి కూడా సక్సెస్ కాలేకపోయింది. 

సుభాషిణి కూతురు పూజ ప్రియాంక  పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ తో చేసిన 143 చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. ఆ మూవీలో సాయిని వన్ సైడ్ లవ్ చేస్తూ కనిపించింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో గుర్తింపు దక్కలేదు. దీంతో 2012లో పెళ్లి చేసుకున్న పూజ ప్రియాంక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. జయసుధ స్టార్ హీరోయిన్‌గా ఎదిగినప్పటికీ తన సోదరితో ఆమె కూతురు కూడా ఇండస్ట్రీలో అంతగా పేరు సంపాదించలేకపోయారు. 

(ఇది చదవండి: ఆరు నెలల వ్యవధిలో అమ్మానాన్న మరణం.. నన్ను ఒంటరిగా వదిలేసి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)