Breaking News

జయసుధ భర్త మరణం.. అప్పులపై జయసుధ క్లారిటీ!

Published on Mon, 03/04/2024 - 16:20

జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్‌ ఎన్టీఆర్‌, ఏఎన్నార్, శోభన్‌ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్‌గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

తన భర్త ఆత్మహత్యకు అప్పులు కారణం కాదని వివరించింది. తాము నిర్మించిన చిత్రాలతో కష్టాలు పడ్డామని తెలిపింది. నా భర్త నితిన్‌ ఆరు సినిమాలు తీశారు. వాటిలో మూడు సక్సెస్‌ కాగా.. మరో మూడు చిత్రాలు ఫెయిల్ అయ్యానని పేర్కొంది. అందరూ అనుకున్నట్లు మాకు ఎలాంటి అప్పులు లేవని జయసుధ వివరించింది. 

జయసుధ మాట్లాడుతూ.. 'నా భర్త ఫ్యామిలీలో వాళ్ల బ్రదర్ కూడా అలానే చనిపోయారు. వాళ్ల మా అత్తగారి తరఫున ఇద్దరు అలాగే సూసైడ్‌ చేసుకున్నారు. ఆయన సూసైడ్‌కు నేను కారణం కాదు. ఆ పరిస్థితి మన ఫ్యామిలీలో ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా. నేనే కదా సంపాదించేది. అప్పట్లో అప్పులంటే మాకు భయమే లేదు. మాకు సూసైడ్ చేసుకునేంత అప్పులు ఉండేవి కావు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా చెడునే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మంచి కూడా ఉంది. నేను కూడా రోజు సోషల్ మీడియా చూస్తాను.' అని అన్నారు. ఆయనను కాపాడేందుకు మేము.. నా భర్త తరఫు ఫ్యామిలీ కూడా ఆయనను కాపాడడానికి చివరి వరకు ప్రయత్నించామని జయసుధ తెలిపారు. కానీ విధిరాత అనేది ఒకటి ఉంటుంది కదా? అని ఆమె అన్నారు. 

ఆయన మరణం తర్వాత నేను షాక్‌లో ఉన్నానని తెలిపింది. కానీ ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి సినిమా చేసినట్లు వివరించింది. ఫస్ట్ చేయకూడదని అనుకున్నా.. కానీ సినిమా చేయడం వల్లే ఆ విషాదం నుంచి బయటపడినట్లు జయసుధ వెల్లడించింది. ఆ సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్‌ సపోర్ట్‌గా ఉన్నారని జయసుధ పేర్కొంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)