వెండితెరపైకి మళ్లీ రానున్న ఒకప్పటి ప్రముఖ హీరోయిన్‌

Published on Sat, 11/02/2024 - 11:53

నటి దేవయాని చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనుంది. టాలీవుడ్‌లో సుస్వాగతం సినిమాలో పవన్‌ కల్యాణ్‌కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించింది. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ,  లవ్‌ స్టోరీ మూవీలో కనిపించింది.  

చాలా కాలం తర్వాత దేవయాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తెరపైకి రాబోతుంది. . దర్శన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్‌లో ఆమె నటించనుంది. ఈ చిత్రం ద్వారా శివ ఆర్ముగం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు కేఎస్‌.అదియమాన్‌ శిష్యుడు అన్నది గమనార్హం. తెలుగులో బొబ్బిలి వంశం (బాలకృష్ణ) సినిమాను అదియమాన్‌ డైరెక్ట్‌ చేశాడు.

విజిత్‌ కథానాయకుడుగా నటిస్తున్న ఇందులో కన్మణి మనోహరన్‌ కథానాయకిగా నటిస్తున్నారు. ఇళవరుసు, రాజ్‌కపూర్‌, మనోజ్‌కుమార్‌, వడివుక్కరసి, కవిత రవి, అక్షర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా దర్శన్‌ మరో వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా నిహారిక, అహనా అనే ఇద్దరు బాల తారలు నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈతరం యువత విదేశీ మోహం తమ కుటుంబ అనుబంధాలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఎలా ప్రతిబంధకంగా మారుతోంది, తద్వారా ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి వంటి పలు ఆసక్తికరమైన అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు.
 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)