Breaking News

ప్రముఖ నటుడు, కమెడియన్‌ వడివేలు ఇంట విషాదం

Published on Thu, 01/19/2023 - 13:35

ప్రముఖ సీనియర్‌ నటుడు, కమెడియన్‌ వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజిని(87) అనారోగ్యంతో కన్నుమూశారు. మధురై సమీపంలోని తమ స్వగ్రామం విరగానూర్‌లో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా వయోభారం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో మూవీ షూటింగ్‌లో పాల్గొన్న వడివేలు తల్లి మరణవార్త తెలిసి షూటింగ్‌ మధ్యలోనే హుటాహుటిన తన స్వగ్రామం విరగానూర్‌కు పయనమయ్యారు. ఇక నేడు(గురువారం) సాయంత్రం స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు జరగునున్నట్లు సమాచారం. 

తల్లి మృతితో వడివేలు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి తమిళనాడు సీఎం స్టాలిన్‌ సంతాపం ప్రకటించారు. అలాగే సినీ ప్రముఖులు, నటీనటులు సైతం సోషల్‌ మీడియా వేదికగా సరోజిని మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా తమిళ నటుడు అయిన వడివేలుకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. స్టార్‌ కమెడియన్‌ ఆయన సౌత్‌ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే గతంలో కొన్ని కారణాల వల్ల ఆయనపై కోలీవుడ్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఆయన గతేడాది నాయి శేఖర్‌ రిటర్న్స్‌తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. 

చదవండి:
హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి
శృతి హాసన్‌కు ఐ లవ్‌ యూ చెప్పడంపై గోపిచంద్‌ మలినేని వివరణ

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు