Breaking News

ధనుష్‌తో కుబేర చూసిన శేఖర్‌.. రెస్పాన్స్‌ అదిరిపోలా!

Published on Fri, 06/20/2025 - 13:19

ఏదో వచ్చామా? నాలుగు సినిమాలు చేశామా? అని కాదు.. చేసిన సినిమా గురించి నలుగురు మాట్లాడుకున్నారా? జనాలు గుండెలో పెట్టుకున్నారా? అనేట్లు ఉండాలి. శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula)కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే.. భారీ ఫైట్లు.. విజువల్‌ ఎఫెక్ట్స్‌.. భారీ బడ్జెట్‌ చిత్రాల జోలికి పోడు. సింపుల్‌గా రాసుకున్న కథలతోనే ఊహించని విజయాలు అందుకుని థియేటర్‌ దగ్గర మ్యాజిక్‌ చేస్తుంటాడు.

నాలుగేళ్ల గ్యాప్‌తో మూవీ
ఇప్పుడదే జరుగుతోంది. ఈయన దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం లవ్‌ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో తీసి ఈ మూవీ భారీ సక్సెస్‌ అందుకుంది. అయినా వెంటనే సినిమా చేయలేదు. నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకుని కుబేర (Kuberaa Movie)తో వచ్చాడు. ధనుష్‌ను యాచకుడిగా, నాగార్జునను సీబీఐ ఆఫీసర్‌గా చూపించాడు. డబ్బు, స్వార్థం చుట్టూ కథ అ‍ల్లుకున్నాడు. జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్‌ టాక్‌ వస్తోంది.

వీడియో వైరల్‌
జనాల స్పందన ఎలా ఉందో చూద్దామని శేఖర్‌, ధనుష్‌ చెన్నైలోని ఓ థియేటర్‌కు వెళ్లారు. ప్రజల అరుపులు, కేకలు విని ఆనందంతో వారికి కడుపు నిండిపోయింది. ధనుష్‌ అయితే.. డంపింగ్‌ యార్డ్‌లో కంపు కొడుతున్నా గంటల తరబడి షూటింగ్‌ చేసిన కష్టాన్ని మర్చిపోయి భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

చదవండి: 'కుబేర నాకెంతో స్పెషల్‌.. నా గురువు మరిన్ని గొప్ప కథలు చెప్పాలి'

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)