Breaking News

ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్

Published on Sun, 12/15/2024 - 07:14

సత్యదేవ్ హీరోగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా జీబ్రా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించారు.  సత్యదేవ్‌, ధనుంజయ్ కీలక పాత్రల్లో నటించగా..  ప్రియాభవానీ శంకర్ హీరోయిన్‌గా మెప్పించింది.  ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌, పద్మజ ఫిల్మ్‌ ప్రైవేట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌  22న విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకున్న జీబ్రా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు తెలుగు ఓటీటీ ఆహా అధికారికంగా ప్రకటించింది.

జీబ్రా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుందని సోషల్‌మీడియాలో వెల్లడించింది. ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్ట్ చేసింది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రం 48 గంటలు ముందుగానే అందుబాటులోకి రానుంది. అంటే ఈ నెల 18 నుంచే ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రైబర్స్‌కు స్ట్రీమింగ్ కానుంది. నార్మల్ ప్లాన్ ఉన్నవారు డిసెంబర్ 20 నుంచి చూసేయొచ్చు.
 

జీబ్రా కథేంటంటే.. 

సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్‌షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్‌లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్‌లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్‌లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)