ఛాన్స్‌ వచ్చినా మోదీ బయోపిక్‌లో నటించను: సత్యరాజ్‌

Published on Thu, 05/23/2024 - 06:43

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్‌ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్‌ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్‌ నటించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు.

ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోపిక్‌ గురించి ఆయన ఇలా మాట్లాడారు. 'నేను నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆ ప్రాజక్ట్‌ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను మోదీ పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి.  భవిష్యత్‌లో మోదీ బయోపిక్‌ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా నేను చేయననే చెప్తాను. ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవాకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి రూమర్స్‌ వచ్చాయి. ఇంతటితో ఆపేయండి' అని క్లారిటీ ఇచ్చారు

మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్‌లో ఈ సినిమాను ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)