Breaking News

శివాజీ సినిమా రిజెక్ట్‌.. 18 ఏళ్ల తర్వాత కారణం వెల్లడించిన నటుడు

Published on Fri, 08/29/2025 - 12:43

రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో శివాజీ (Sivaji Movie) ఒకటి. 2007లో వచ్చిన ఈ సినిమాలో తలైవాను ఢీ కొట్టే విలన్‌గా నటించమని మొదట సత్యరాజ్‌ను సంప్రదించారట! రజనీతో సమానంగా పారితోషికం ఇస్తామని చెప్పినా ఆయన నో చెప్పారట! నేనెంత కష్టపడ్డా సరే.. రజనీకాంత్‌ వచ్చి స్టైల్‌గా ఏదో ఒకటి చేసేసరికి తనకే గుర్తింపు వస్తోందని బాధపడేవారట! శివాజీలో విలన్‌గా చేస్తే మరి తను హీరోగా నటించే మూవీలో రజనీ విలన్‌గా నటిస్తాడా? అని ఎదురు ప్రశ్నించాడని ప్రచారం జరిగింది. 

విలన్‌గా ముద్ర వేస్తారని..
రజనీ సినిమాల్లో నటించడం ఇష్టం లేక సత్యరాజ్‌ ఆ అవకాశాన్ని తిరస్కరించారంటూ ఈ అంశంపై పెద్ద చర్చ జరిగింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ వివాదంపై స్పందించాడు సత్యరాజ్‌ (Sathyaraj). ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పుడు నేను హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నా సినిమాలు ఫ్లాప్‌ అవుతుండటంతో నాకంటూ మళ్లీ మార్కెట్‌ సృష్టించుకునే పనిలో పడ్డాను. సరిగ్గా ఆ సమయంలో డైరెక్టర్‌ శంకర్‌ శివాజీ సినిమా ఆఫర్‌ చేశాడు. ఒక్కసారి విలన్‌గా చేస్తే ఇక అన్నీ ప్రతినాయకుడి పాత్రలే వస్తాయి. అందుకే తిరస్కరించాను అని క్లారిటీ ఇచ్చాడు.

39 ఏళ్లు పట్టింది!
కాగా సత్యరాజ్‌.. విలన్‌ దగ్గర పనిచేసే రౌడీల్లో ఒకరిగా కెరీర్‌ మొదలుపెట్టాడు. నూరవత్తు నాల్‌ (1984) చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. తర్వాత మెయిన్‌ విలన్‌గా మారాడు. ఓపక్క విలనిజం పండిస్తూనే మరో పక్క హీరోగానూ మారాడు. రజనీకాంత్‌తో కలిసి పలు సినిమాల్లోనూ యాక్ట్‌ చేశాడు. వీరిద్దరూ చివరగా నటించింది 1986లో వచ్చిన మిస్టర్‌ భరత్‌ మూవీలో! ఇందులో రజనీ తండ్రిగా సత్యరాజ్‌ యాక్ట్‌ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి 39 ఏళ్లు పట్టింది. శివాజీ, ఎంతిరన్‌ (రోబో) సినిమాలకు నో చెప్పుకుంటూ పోయిన సత్యరాజ్‌ ఎట్టకేలకు కూలీ చిత్రంలో రజనీ ఫ్రెండ్‌గా యాక్ట్‌ చేశాడు.

చదవండి: ఆ టాలీవుడ్‌ హీరో అంటే ఫుల్ క్రష్‌.. సురేఖవాణి కూతురు సుప్రీత

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)