Breaking News

ఓటీటీలో 'సత్యం సుందరం'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Published on Tue, 10/22/2024 - 10:44

కార్తి - అరవింద్‌ స్వామి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'సత్యం సుందరం'. ఫీల్‌గుడ్‌ చిత్రంగా ప్రేక్షకుల నుంచి మించి రివ్యూస్‌నే దక్కించుకుంది. సూర్య-జ్యోతిక తక్కువ బడ్జెట్‌లో ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్‌ 28న థియేటర్‌లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీంతో 'సత్యం సుందరం' అభిమానుల్లో సంతోషం కనిపిస్తుంది.

తమిళంలో '96' వంటి ఫీల్‌ గుడ్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన సి.ప్రేమ్‌కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అక్టోబర్‌ 25 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్‌లో చూడలేకపోయిన వారు తమ ఫ్యామిలీ, స్నేహితులతో తప్పక చూడాల్సిన సినిమాగా నెటిజన్లు చెప్పుకొచ్చారు. 

కథ అయితే, చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సుమారు 3 గంటలపాటు ప్రేక్షకులను దర్శకుడు మెప్పించాడు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 60 కోట్లు రాబట్టిన 'సత్యం సుందరం' మంచి లాభాలను అందించారు.  చిత్రంలో అరవింద్‌ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)