Breaking News

ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు

Published on Thu, 02/05/2026 - 08:40

జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సినిమా. అయినా కంగారుపడకుండా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సర్వం మాయ. హారర్ సినిమా అంటే దెయ్యం, అస్థిపంజరం, స్మశానం... ఇవే ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే తరుణంలో దర్శకుడు అఖిల్ సత్యన్ ఓ మాయ చేసి ఈ సర్వం మాయ హారర్ సినిమాలోని దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా ఇష్టపడేట్టు చేశాడు. నిజానికి ఇది ఓ గొప్ప ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. 

సర్వం మాయ (Sarvam Maya movie) ఓ మళయాళ సినిమా. ఈ సినిమాలో కథానాయకుడైన ప్రబేందు స్వతహాగా నాస్తికడైనా కుల వృత్తి ప్రకారం అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రబేందు మంచి గిటారిస్టు కూడా. ప్రబేందు తన బంధువైన రూపేష్ బలవంతం చేయడంతో అనుకోకుండా ఓ రోజు దెయ్యం వదిలించే పూజను ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఇక అక్కడ నుండి కథ రసరంజకంగా సాగుతుంది. దెయ్యం అంటే ఆషామాషి దెయ్యం కాదు. ఆ దెయ్యాన్ని చూస్తే ప్రేక్షకులు కూడా తమకూ అలాంటి దెయ్యం కనిపిస్తే బాగుండునని అనుకోక మానరు. అన్నట్టు ఆ దెయ్యానికి ఓ పేరు కూడా ఉంటుంది అదే డెలలూ. 

ఈ కథలో ప్రబేందును కలిసిన ఆ డెలలూ చేసే అల్లరి, చిలిపితనం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ డెలలూ తాను ఎవరినో, ఎందుకు చనిపోయి దెయ్యం అయిందో అన్న సమాధానం కోసం వెతుకుతూ ప్రబేందుని పట్టుకుంటుంది. మరి ఆ డెలలూ ఆచూకీ కనిపెట్టడంలో ప్రబేందు డెలలూకి సాయపడతాడా, అలాగే ఆ డెలలూ వల్ల ప్రబేందుకి కలిగిన ఇబ్బందులు ఏంటి అనేవి మాత్రం హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న సర్వం మాయ చూడాల్సిందే. 

ఈ సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా దెయ్యం వచ్చినప్పటి నుండి మహా సరదాగా సాగిపోతుంది. కాకపోతే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్‌లో పడేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మొత్తం డెలలూ కోసం ఓసారి చూడాల్సిందే. ఇంకెందుకాలస్యం వీకెండ్ హాట్ స్టార్ ట్యూన్ చేసి డెలలూతో జత కట్టండి.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)