మాస్‌ హీరో కోసం 'సప్త సాగరాలు' దాటి వచ్చేస్తున్న వైరల్‌ బ్యూటీ

Published on Sun, 01/21/2024 - 08:50

సినిమా ప్రపంచంలోకి కొత్త హీరోయిన్‌లు వస్తూనే ఉంటారు... భాష ఏదైనా కానివ్వండి తమ వద్ద టాలెంట్‌ ఉంటే చాలు ఒక్క సినిమాతోనే పాన్‌ ఇండియా రేంజ్‌ఉ చేరుకుంటారు. ఆపై ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. అలాంటి స్టార్ల జాబితాలోకి తాజాగా ఓ కన్నడ ముద్దుగుమ్మ చేరింది. ఆమె పేరు రుక్మిణి వసంత్​. రక్షిత్ శెట్టి నటించిన  'సప్త సాగరాలు దాటి' సినిమాలో నటించింది. ఆపై తెలుగు వారికి కూడా తెగ నచ్చేసింది ఈ బ్యూటీ. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచే సినిమాలపై అభిమానం పెంచుకుంది. దీంతో లండన్‌ వెళ్లి  యాక్టింగ్ కోర్సు పూర్తి చేసి ఇక్కడికి వచ్చింది.

కన్నడ నుంచి రెండు సినిమాల్లో నటించినా 'సప్త సాగరాలు దాటి' చిత్రం ద్వారా పాపులర్‌ అయిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రిలీజ్‌ అయింది. ఈ చిత్రాల ద్వారా అందరినీ ఫిదా చేసింది. నటనతో పాటు తన అందంతోనూ ఈ అమ్మడు అందరినీ కట్టిపడేస్తుంది. "సప్త సాగరాలు దాటి" సినిమా రొమాంటిక్, భావోద్వేగాలను ఆకర్షించింది. యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఆదరణ కరువైంది. ముఖ్యంగా, రుక్మిణి వసంత్‌ ప్రశంసలు అందుకుంది, చాలామంది ఆమెను ప్రశంసించడమే కాకుండా సాయి పల్లవితో పోల్చారు.

(ఇదీ చదవండి: సలార్‌లో అఖిల్‌ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ సతీమణి)

తాజాగా రుక్మిణి వసంత్ తన మొదటి తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో ఈ బ్యూటీకి ఛాన్స్‌ దక‍్కింది. 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు K. V. అనుదీప్ డైరెక్షన్‌లో  రవితేజ ఒక సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని  సమాచారం. జాతిరత్నాలు తరహాలోనే కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)