నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్
Breaking News
సంతోశ్ శోభన్ రాకాస.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
Published on Sun, 04/05/2026 - 16:18
మ్యాడ్ హీరో సంతోష్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన మరో సినిమా 'రాకాస'. ఈ సినిమాను నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీతో మానస శర్మ అనే అమ్మాయి దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రిలీజైంది.
ఈ చిత్రానికి తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. రెండో రోజు కూడా ఈ సినిమా అదే జోరు కొనసాగించింది. వీకెండ్ కలిసి రావడంతో రెండు రోజుల్లో రూ.10.30 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది.
This isn’t just a run… it’s a full-blown festival in theatres. 🎬✨#Rākāsā crosses a solid 10.30 CR worldwide in just 2 days — powered by packed houses, whistles, and non-stop laughs. 😎❤️🔥
Lights on, confetti up… and the box office joins the celebration. 🎉🔥
Don't miss out… pic.twitter.com/w4R7Z6OS3a— Pink Elephant Pictures (@PinkElephant_P) April 5, 2026
Tags : 1