Breaking News

మోనాలిసా సంచలన ఆరోపణలు.. షాకిచ్చిన దర్శకుడు..!

Published on Fri, 03/27/2026 - 16:30

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాతో పాపులర్‌ అయిన మోనాలిసా భోంస్లే ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. తనకు మొదటిసారిగా సినిమా ఛాన్స్‌ ఇస్తున్నట్లు ప్రకటించిన బాలీవుడ్‌ దర్శకుడు సనోజ్‌ మిశ్రాపై  సంచలన ఆరోపణలు చేసింది. షూటింగ్ సెట్‌లో సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా వాపోయింది. షూటింగ్‌ పేరుతో​ తన శరీరాన్ని పలుమార్లు తాకుతూ చాలా ఇబ్బందిపెట్టేవాడిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. దీంతో ఈ టాపిక్‌ బాలీవుడ్‌ చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై డైరెక్టర్ సనోజ్ మిశ్రా స్పందించారు. దర్శకుడు మోనాలిసా చేసిన ఆరోపణలను ఖండించారు. నేను ఎవరికైతే అండగా నిలబడ్డానో.. ఆమె నన్ను ఇబ్బందుల్లో పడేసిందని అన్నారు. కేవలం నేను ఆమె ఫర్మాన్‌ ఖాన్‌తో వెళ్లిపోవడాన్ని వ్యతిరేకించినందుకే మోనాలిసా నాపై ఆరోపణలు చేసిందని అన్నారు. తనకు నటించడం కూడా నేనే నేర్పించా.. తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉజ్జయినిలోని నా ఇంట్లోనే నివసిస్తున్నారని సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమె పెళ్లిని తాను వద్దన్నందుకే ఇలా చేసిందని వెల్లడించారు. ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లిని వ్యతిరేకించారని.. ఈ వివాహం చెల్లదని ప్రకటించారని పేర్కొన్నారు. 

పరువు నష్టం దావా వేస్తా..

మోనాలిసాపై త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానని సనోజ్ మిశ్రా వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఒకవేళ తాను చెప్పేది నిజమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. అలాగే ఈ ​​సినిమా నిర్మాణం ఇక జరగదు.. ఎందుకంటే ఆమె దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇక సినిమా అనేది  పూర్తిగా వేరే అంశమని సనోజ్ మిశ్రా అన్నారు. మోనాలిసా లైంగిక ఆరోపణలు చేసిన తర్వాత సనోజ్ మిశ్రా స్పందించారు. ప్రస్తుతం సనోజ్ మిశ్రా దర్శకత్వంలో 'ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోనాలిసా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

(ఇది చదవండి: నన్ను తాకేవాడు.. ఇంట్లో వాళ్లకు చెబితే సర్దుకుపొమ్మన్నారు: మోనాలిసా)

 

Videos

భారత్ పై యుద్ధ ప్రభావం మోదీ అలర్ట్ సీఎంలతో అత్యవసర మీటింగ్

వంట నూనెలకూ యుద్ధం సెగ ఉక్కిరిబిక్కిరి...

CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు

నేను ఆత్మహత్య చేసుకుంటా.. మరో సంచలన వీడియోతో ఆరవ శ్రీధర్ బాధితురాలు

CNG గ్యాస్ కోసం ఆటో డ్రైవర్ల పడిగాపులు

యువకుడు - వివాహిత ఏలూరు ఇంస్టాగ్రామ్ ప్రేమ కధ చివరికి ఏం జరిగిందంటే

విజయవాడ YSRCP ఆఫీస్ లో" శ్రీరామనవమి వేడుకలు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమరావతి కాదు.. ATM ప్రతీ పైసా లెక్క చెప్పకపోతే.. బాబుపై MLC కల్పలతా రెడ్డి ఫైర్

ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది

Photos

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)