Breaking News

సంక్రాంతికి వస్తున్నాం గోదారిగట్టు సాంగ్.. ఫారిన్ దంపతులు డ్యాన్స్ చేస్తే!

Published on Wed, 06/25/2025 - 21:57

ఈ ఏడాది సంక్రాంతి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం  థియేటర్లలో ఓ రేంజ్‌లో అదరగొట్టేసింది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్‌లో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.

అయితే ఈ సినిమాలోని ఓ పాట ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఊపేసింది. గోదారిగట్టు మీద రామ చిలకవే అంటూ అభిమానులతో స్టెప్పలేయించింది. ఈ పాటలో వెంకీమామ, ఐశ్వర్య రాజేశ్‌ తమ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించారు. అంతేకాకుండా ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ ఏకంగా 200 మిలియన్ల వ్యూస్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  ఈ సాంగ్‌కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా.. సుమారు 18 ఏళ్ల తర్వాత రమణగోగుల ఆలపించడం విశేషం. ఫిమేల్‌ లిరిక్స్‌ను మధుప్రియ కూడా చాలా అద్భుతంగా పాడింది.  భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

అయితే ఈ పాటకు కేవలం మన ఆడియన్స్ మాత్రమే ఊగిపోయారనుకుంటే పొరపాటే అవుతుంది. తాజాగా ఫారినర్స్ కూడా ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు. స్వీడన్‌కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్‌ అనే నటుడు తన సతీమణితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. వెంకటేశ్ ఐశ్వర్య రాజేశ్ పాత్రల్లో వీరిద్దరు అదరగొట్టేశారు. కేవలం ఈ సాంగ్ మాత్రమే కాదు.. పలు ఇండియన్ చిత్రాలకు సంబంధించిన పాటలతో పాటు డైలాగ్స్, సీన్స్ కూడా రీ క్రియేట్ చేస్తుంటారు. ఏదేమైనా ఇండియన్ సినిమాలపై వీరికున్న అభిమానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం గోదారి గట్టు మీద రామ చిలకవే సాంగ్ చూసేయండి.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)