Breaking News

Sankranthiki Vasthunam: ఓటీటీలో కన్నా ముందుగా టీవీలో.. ఎప్పుడంటే?

Published on Sat, 02/22/2025 - 14:32

పొంగల్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఓటీటీలో కంటే ముందుగా టీవీ ఛానల్‌లో రిలీజ్‌ కానుంది. అదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అంటూ ఊరించిన జీ తెలుగు ఫైనల్‌గా టెలివిజన్‌ ప్రీమియర్‌ డేట్‌ను వెల్లడించింది. మార్చి 1న సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానల్‌లో సంక్రాంతికి వస్తున్నాం ప్రసారం కానున్నట్లు ప్రకటించింది.

థియేటర్‌లో రిలీజైన ఏ సినిమా అయినా ముందుగా ఓటీటీ (OTT)లోకి వచ్చేది. నాలుగైదువారాల్లో ఓటీటీలోకి రావడం ఆ తర్వాతే టీవీలోకి రావడం జరిగేది. కానీ తొలిసారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ పద్ధతికి చెక్‌ పెట్టింది. ఓటీటీని కాదని ఏకంగా టీవీలో ముందుగా ప్రసారమవుతూ కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశేషాలు
విక్టరీ వెంకటేశ్‌ హీరోగా ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించగా భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. సినిమాలో బుల్లిరాజు కామెడీకి జనాలు కడుపుబ్బా నవ్వుకున్నారు. జనాల ఆదరణతో ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలపై కాసుల వర్షం కురిపించింది. 2027లో సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్‌ కూడా రానుంది.

 

 

చదవండి: లుక్స్‌తోనే భయపెట్టిన తమన్నా.. ఉత్కంఠంగా ‘ఓదెల 2’ టీజర్‌

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)