Breaking News

టాప్‌-5 నుంచి 'సంజన' ఎలిమినేట్‌.. భారీగా రెమ్యునరేషన్‌

Published on Sun, 12/21/2025 - 20:46

బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి సంజనా గల్రానీ టాప్‌- 5 నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. నాలుగో రన్నర్‌గా ఆమె నిలిచారు. నటుడు శ్రీకాంత్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. సంజన 105 రోజుల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నారు. మొదట ఆమె టాప్-5లో  ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే, కోడిగుడ్లు దొంగతనం చేసి నెట్టింట వైరల్‌ అయిపోయింది. అలా తన ఆట నెటిజన్లకు సులువుగా చేరిపోయింది. ఆ తర్వాత తల్లీకొడుకు బంధంతో ఇమ్మానుయేల్‌తో కనెక్ట్‌ అయిపోయింది. ఈ క్రమంలో ఇమ్ము నామినేషన్‌కు రాకపోవడంతో అతని అభిమానులు కూడా సంజనకు ఓట్లు వేస్తూ కాపాడారు. దీంతో సంజన సులువుగా టాప్‌-5 వరకు చేరుకుంది.

సంజన ఆటలో ఇమ్ము చాలా కీలకం. అయితే, ఆమె చివరి వారాల్లో మాట్లాడిన తీరు, ఆట ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. బిగ్‌బాస్‌లో  ఆమె ప్రయాణం ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్‌ చేసిందో సంజన జర్నీ  వీడియో చూస్తే అర్థం అవుతుంది. సంజనలోని ఫన్నీ, ఎమోషనల్, గొడవలు వంటి వాటిని బాగా బాగా చూపించారు.

సంజన రెమ్యునరేషన్‌
సంజన ఇప్పటికే సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రెమ్యునరేషన్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది. టాప్‌-5 ఉన్నవారందరి రెమ్యునరేషన్‌ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో సంజన గల్రానీ బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఆమెకు రోజుకు 40 వేల వరకు రెమ్యునరేషన్‌ వచ్చినట్లు టాక్‌. అంటే ఒక వారానికి సుమారుగా రూ. 2.80 లక్షలు ఉంటుంది. అలా 15 వారాలు బిగ్ బాస్‌లో ఉన్నారు. దీంతో సుమారుగా రూ. 42 లక్షల వరకు పారితోషికాన్ని సంజన తీసుకున్నట్లు తెలుస్తోంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)