Breaking News

'రాజాసాబ్‌' విలన్‌ నటించిన హారర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published on Thu, 07/10/2025 - 19:30

హారర్‌ సినిమా 'ద భూతిని' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మౌనీ రాయ్‌, సన్నీ సింగ్‌, పాలక్‌ తివారి కీలక పాత్రలు పోషించారు. సిద్దాంత్‌ కుమార్‌ సచ్‌దేవ్‌ దర్శకత్వం వహించాడు. సంజయ్‌ దత్‌తో పాటు దీపక్‌ ముకుత్‌ నిర్మించారు.

నెలన్నర తర్వాతే ఓటీటీలో రిలీజ్‌
మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. తాజాగా జీ5 ద భూతిని ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. జూలై 18న జీ5లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియో క్లిప్‌ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేసింది. సినిమా బాలేదంటే నెల తిరిగేలోపే ఓటీటీలో రిలీజ్‌ చేస్తారు. కానీ ఈ చిత్రాన్ని మాత్రం నెలన్నర గ్యాప్‌ తర్వాతే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తెస్తున్నారు.

సినిమాలు
సంజయ్‌ దత్‌ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా అనేక సినిమాలు చేశాడు. డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రంతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నాడు. ఈయన కీలక పాత్రలో నటించిన ది రాజా సాబ్‌ డిసెంబర్‌ 5న విడుదల కానుంది. ఈయన హిందీలో యాక్ట్‌ చేసిన ధురంధర్‌ మూవీ కూడా అదే రోజు (డిసెంబర్‌ 5నే) రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తన రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కాకూడదని కోరుకుంటున్నాడు సంజయ్‌.

 

 

చదవండి: యాంకరింగ్‌లో సిండికేట్‌.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)