Breaking News

కనీసం మర్యాద కూడా ఇవ్వరు.. ఫోన్‌ చేస్తే ఇలా మాట్లాడుతారు: సంగీత

Published on Tue, 08/20/2024 - 06:53

నటి సంగీత ఒకప్పుడు సౌత్‌ ఇండియాలో పాపులర్‌ హీరోయిన్‌గా కొనసాగింది. తెలుగులో ఖడ్గం చిత్రంలో పెద్ద సినిమా నటి కావాలన్న ఆశతో పల్లెటూరి నుంచి తల్లితో కలిసి హైదరబాద్‌కు వచ్చి ఒక్క ఛాన్స్‌ అంటూ బ్రతిమలాడుతూ కంట తడిపెట్టే సన్నివేశంలో ఆమె నటనను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అలాంటి సంగీత పలు చిత్రాల్లో కథానాయకిగా నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగునే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించిన ఈమె గాయకుడు క్రిష్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉన్నారు. 

వివాహానంతరం గుణ చిత్ర పాత్రల్లో నటిస్తున్న సంగీత ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు తమిళ చిత్రాల్లో కంటే తెలుగు చిత్రాల్లో నటించడమే ఇష్టం అని చెప్పారు. కారణం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ గౌరవం లభిస్తుందన్నారు. తనకు తమిళంలో నటించడం ఇష్టం లేదు అంటే తమిళ అభిమానులు ఆగ్రహించవచ్చని అయినా తాను నిజమే చెబుతున్నానన్నారు. కోలీవుడ్‌లో నటించేటప్పుడు సరైన మర్యాద ఉండదన్నారు. 

నిజం చెప్పాలంటే తమిళంలో తానెవరినీ అవకాశాలు అడిగింది కూడా లేదన్నారు. ఎందుకంటే తెలుగులో తనకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. అంతే కాదు మంచి పారితోషికం, అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. అయితే తమిళంలో కొందరు అవకాశాల కోసం ఫోన్‌ చేసినా, వారు మర్యాద లేకుండా మాట్లాడతారన్నారు. వారే తనకు జీవితాన్ని ఇస్తున్నట్లు మాట్లాడతారని అన్నారు. తన పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించేసి వచ్చి నటించి వెళ్లండి అని అంటారన్నారు. తనకు తమిళ చిత్ర పరిశ్రమలో మర్యాద లేదని, అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించడం లేదని సేర్కొన్నారు. ఈమె చెప్పిన విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.
 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)