Breaking News

తొక్కిసలాట ఘటన: నాంపల్లి కోర్టుకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం

Published on Fri, 01/03/2025 - 12:54

సాక్షి, హైదరాబాద్‌: పుష్ప 2 ప్రీమియర్స్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)పై సంధ్య థియేటర్‌ యాజమాన్యం నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనలో A1, A2గా ఉన్న థియేటర్‌ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్న రామిరెడ్డి బెయిల్‌ కోసం శుక్రవారం నాడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం చిక్కడపల్లి పోలీసులను ఆదేశించింది.

తమకు గంట సమయం కావాలని కోరిన పోలీసులు మరికాసేపట్లో కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్‌ యజమానుల తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ఇదే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్న న్యాయస్థానం మరికాసేపట్లో తీర్పు వెల్లడించనుంది.

ఏం జరిగింది?
డిసెంబర్‌ 4న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో పుష్ప 2 (Pushpa 2 Movie) ప్రీమియర్స్‌ ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు అటు అల్లు అర్జున్‌, అతడి టీమ్‌తో పాటు సంధ్య థియేటర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయగా మధ్యంతర బెయిల్‌పై అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.

A1 పెద్దరామిరెడ్డి, A2 చిన్న రామిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు

చదవండి: అల్లు అర్జున్‌కు నేడు బెయిల్‌ లభించనుందా.. ?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)