Breaking News

అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయడం కరెక్టే: పవన్‌ కల్యాణ్‌

Published on Mon, 12/30/2024 - 13:20

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre stampede case) ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, హీరో పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేయడం కరెక్టేన్నారు. ఘటన జరిగిన రెండో రోజే బాధిత కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడుంటే ఇంత జరిగేది కాదన్నారు. బన్నీ గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నాడని విమర్శించారు.

ప్రతి హీరో అదే చేయాలనుకుంటాడు
సోమవారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు. అలాగే తన అభిమానులకు అభివాదం చేయాలనుకుంటారు. అయితే థియేటర్‌కు వెళ్లేముందే అల్లు అర్జున్‌ (Allu Arjun) అక్కడి ఏర్పాట్లు చూసుకోవాల్సింది. 

ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది
అభిమాని చనిపోయినప్పుడు వెంటనే వారి ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది. ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్లయింది. రెండో రోజే వెళ్లి మాట్లాడుంటే ఇంత జరిగేది కాదు.  అల్లు అర్జున్‌ కాకపోయినా కనీసం టీమ్‌ అయినా సంతాపం చెప్పాల్సింది. అలాగే సారీ చెప్పడానికి పలు విధానాలుంటాయి.  తన పేరు చెప్పలేదని రేవంత్.. బన్నీని అరెస్టు చేశారనడం కూడా పెద్ద తప్పు. రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత. 

తొక్కిసలాట
మనమెంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమే అని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. కాగా డిసెంబర్‌ 4న పుష్ప 2 ప్రీమియర్స్‌లో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే! ఈ ఘటనపై పోలీసులు థియేటర్‌ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు.

 
చదవండి: సంధ్య థియేటర్: పవన్‌ కల్యాణ్‌ ఎవర్‌గ్రీన్‌ రికార్డ్‌ను కొట్టేసిన 'పుష్ప'

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)