Breaking News

‘రణబాలి’పై సందీప్‌ రెడ్డి వంగా రివ్యూ

Published on Sun, 10/18/2026 - 07:38

ఇండియన్‌ సినిమాలో యాక్షన్‌ హీరో అంటే విజయ్‌ దేవరకొండ గురించే చెప్పుకుంటారని దర్శక–నిర్మాత సందీప్‌ రెడ్డి వంగా పేర్కొన్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మకా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన  సినిమా ‘రణబాలి’. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాకు రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించారు. టీ సిరీస్‌ సమర్పణలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలైంది. ఈ సినిమాను దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా వీక్షించి, తన స్పందనను ‘ఎక్స్‌’ వేదికగా ఆయన తెలిపారు.

(చదవండి: రణబాలి మూవీ రివ్యూ)

‘‘విజయ్‌... నీ యాక్షన్, ఫెరోషియస్‌ పెర్ఫార్మెన్స్‌ అద్భుతంగా ఉన్నాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై నీ ఫైట్స్‌ చూస్తుంటే ఆ ఇంటెన్సిటీ ఫీల్‌ అయ్యాం. ఇకపై ఇండియన్‌ సినిమాలో యాక్షన్‌ హీరో అంటే నీ గురించే చెప్పుకుంటారు. కంగ్రాట్స్‌ విజయ్‌... ప్రేక్షకులు ‘రణబాలి’ చిత్రాన్ని విజయ్‌ ఔట్‌ స్టాండింగ్‌ పెర్ఫార్మెన్స్‌ కోసం చూడాలి. జయమ్మ పాత్రలో రష్మిక ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఎంతో రియలిస్టిక్‌ ఫీల్ను కలిగించింది. అజయ్‌ – అతుల్‌ మ్యూజిక్‌ మరో హైలైట్‌ గా నిలిచింది. చరిత్ర నుంచి ఇలాంటి ఒక నేపథ్యాన్ని ఎంచుకుని సినిమాగా రూపొందించిన డైరెక్టర్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. పాఠ్యపుస్తకాల్లో చెప్పని చారిత్రక అధ్యాయాన్ని ‘రణబాలి’ చూపించింది’’ అని సందీప్‌రెడ్డి వంగా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. 

(చదవండి: 'రణబాలి' జంట దుర్గమ్మ దర్శనం)

అలాగే సందీప్‌ రెడ్డి వంగాకు విజయ్‌ దేవరకొండ ‘ఎక్స్‌’ వేదికగానే బదులు ఇచ్చారు. ‘‘వంగా... నువ్వు సినిమా చూశావు... నీ రివ్యూను చెప్పావు. మన కాంబినేషన్‌లో వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా ప్రీమియర్స్‌ తర్వాత మన హగ్, నీ వాయిస్‌ నాకు ఇంకా గుర్తుంది. పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే ఫీలింగ్‌ కలిగింది. ‘రణబాలి’ సినిమా నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఈ సినిమాపై నువ్వు ఇలా స్పందించడం నాకు చాలా కిక్‌ ఇచ్చింది’’ అని విజయ్‌ దేవరకొండ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.  

ఆనందం ఉప్పొంగుతోంది: రష్మికా మందన్నా 
ఈ సంగతి ఇలా ఉంచితే...రణబాలి సినిమాలో జయమ్మ పాత్రను పోషించడం పట్ల రష్మిక మందన్నా ఓ సుధీర్ఘమైన ఎమోషనల్‌ నోట్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్‌ చేశారు. ‘‘జయమ్మ..ఆమె ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఓ మహిళగా ఉండటమంటే ఏంటో ఆమె నాకు నేర్పింది. తన ప్రజల కోసం నిలవడం, తన వారిని కాపాడుకోవడం, ప్రేమను పంచడం..ఇదే నిజమైన స్త్రీతత్వానికి అర్థమని తెలిపింది. మన సామాజిక శక్తిని, దేవుడిపై విశ్వాసాన్ని, సమష్టిగా పోరాడే స్ఫూర్తిని ‘రణబాలి’ సినిమా చాటిచెబుతోంది. 

ఇక దర్శకుడు రాహుల్‌ కృషికి ప్రశంసలు వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. విజయ్‌...నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. ఇప్పుడూ చెబుతున్నాను. నువ్వు కష్టపడే గుణానికి నేను నీకు అభిమానిని. ఇప్పుడు నీ కష్టాన్ని అందరు మెచ్చుకుంటుంటే నాలో ఆనందం ఉప్పొంగుతోంది. ఇప్పటికే ‘రణబాలి’ సినిమా చూసిన వారికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ప్రేమ తో..మీ జయమ్మ..’ అంటూ రష్మిక మందన్నా స్పందించారు.  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)