Breaking News

యానిమల్ టీజర్.. సందీప్ రెడ్డి వంగా ఏ మాత్రం తగ్గలేదు

Published on Thu, 09/28/2023 - 11:16

'అర్జున్‌ రెడ్డి' సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్‌ చేసి అక్కడా మంచి విజయాన్ని అందుకున్నారాయన. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్‌ యువ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో 'యానిమల్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ-టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేసింది. తాజాగా టీజర్‌ను కూడా విడుదల చేశారు.

(ఇదీ చదవండి: Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ)

ఈరోజు రణబీర్ కపూర్ పుట్టినరోజు కావడంతో సందీప్ రెడ్డి వంగా టీజర్‌ను షేర్‌ చేశారు. ఇందులో రణ్‌బీర్‌ రగ్గడ్‌ లుక్‌లో, మాస్‌ అవతారంలో దుమ్ములేపాడు. ఈ టీజర్‌ను గమనిస్తే అనిల్ కపూర్-రణబీర్ కపూర్ మధ్య  తండ్రీ కొడుకుల ఎమోషన్‌ను చూపిస్తోంది.నన్ను ఏ విషయం గురించి అడిగినా నిజాయితీగా జవాబు ఇస్తాను. కానీ, మా నాన్న గురించి మాత్రం అడగొద్దు అని హీరో చెప్పే డైలాగ్‌తో పాటు నా ఫాదర్ ఈ ప్రపంచంలోకెల్లా బెస్ట్ అనడం ఇలా అన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. టీజర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పిస్తుంది.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు)

ఇందులో రణబీర్‌ను మూడు వేరియేషన్స్ లో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు.  ఒక షాట్‌లో రణబీర్ పడిపోయినప్పుడు కనిపించే సీన్‌ హైలెట్‌గా నిలుస్తుంది. అంతేకాకుండా టీజర్ ఎండ్‌లో బాబీ డియోల్ సింపుల్‌గా ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సూపర్‌ అనిపించేలా ఉంది. బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌ సినిమాతో రూ.300 కోట్లకు పైగా కొల్లగొట్టిన సందీప్‌ రెడ్డి వంగ తాజాగా ఈ చిత్రంతో మరెన్ని కోట్లు కొల్లగొట్టనున్నాడో వేచి చూడాలి. డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)