Breaking News

ప్రేమ పెళ్లి, కొన్ని వారాలకే విడాకులు.. కొత్త కారు కొన్న నటి

Published on Thu, 08/24/2023 - 12:43

పెళ్లికి ముందు ఉన్న ప్రేమ.. ఆ తర్వాత ఉండదని చాలామంది అంటుంటారు. ఏళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగి మనసారా ప్రేమించుకున్న జంటపక్షులు పెళ్లి తర్వాత మాత్రం సడన్‌గా మారిపోతారు. అప్పటిదాకా ఒకరిపై మరొకరు కురిపించుకున్న ప్రేమ.. మెడలో మూడు ముళ్లు పడ్డ తర్వాత మాత్రం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ప్రేమ స్థానంలో గొడవలు, విభేదాలు మొదలవుతాయి. అది చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకూ వెళ్తాయి. ఇప్పుడు చెప్పుకునే బుల్లితెర జంట కూడా అదే జాబితాలోకి వస్తుంది.

సీరియల్‌తో మొదలైన ప్రేమకథ
సంయుక్త.. తర్వాతి కాలంలో తన పేరును సంయుతగా మార్చుకుంది. సంయుత-విష్ణుకాంత్‌ సిప్పినీల్‌ ముత్తు సీరియల్‌లో కలిసి నటించారు. అప్పుడే వీరి చూపులు, మనసులు కలిశాయి. కొంతకాలం పాటు ప్రేమ జర్నీని ఎంజాయ్‌ చేసిన వీరు పెద్దలను ఒప్పించి ఈ ఏడాది మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. అభిమానులు కూడా ఫుల్‌ ఖుషీ అయ్యారు. కానీ అప్పుడు మొదలైంది అసలు సమస్య. ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చలేదు. నెల రోజులకే విభేదాలు మొదలయ్యాయి. సర్దుకుపోదామనుకున్నారు, కుదర్లేదు.. మరో నెలరోజులకు విడిపోతున్నట్లు ప్రకటించారు. తన భార్య.. మాజీ ప్రియుడు విజయ్‌తో ఇంకా టచ్‌లో ఉందని ఆడియోక్లిప్‌ వదిలాడు విష్ణుకాంత్‌.

నటికి పట్టపగలే చుక్కలు చూపించిన భర్త!
తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది సంయుత. వీరి విడాకుల వ్యవహారం అప్పట్లో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా సంయుత కొత్త కారు కొనుగోలు చేసింది. 'స్వతంత్రంగా కష్టపడి జీవించగలిగే మహిళకు ఏదైనా సాధ్యమే.. మంచి మనసుతో, సద్భావాలతో ఈ సమాజంలో నెట్టుకురావడం ఒక అమ్మాయికి చాలా  కష్టం. మనమేం చేసినా సరే కొందరు అదేపనిగా తిడుతూ ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే మేలు. మనమేంటనేది ఎవరికీ నిరూపించుకోవాల్సిన పని లేదు.

కుక్కలను మొరగనివ్వండి..
కుక్కలను అలాగే మొరగనివ్వండి. వాళ్ల మనసులు కుళ్లుకుతంత్రాలతో ఎంత మురికిగా మారిందో వాళ్లకే తెలుసు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ఆశయాలపై ఫోకస్‌ చేయండి. స్వతంత్రంగా జీవించండి. పురుషాహంకారంతో విర్రవీగే వాళ్లముందు బాస్‌ లేడీగా ధైర్యంగా నిలబడండి. మీరు అందుకునే విజయాలతో వాళ్ల ఆలోచన తప్పని వారికే అర్థమయ్యేలా చేయండి. ఒంటరిగా తనకాళ్లపై తను నిలబడి బతుకుతున్న ప్రతి మహిళకు ఈ పాజిటివ్‌ వైబ్స్‌ అందిస్తున్నాను' అని రాసుకొచ్చింది. దీనికి తన కొత్త కారు వీడియోను జత చేసింది.

మూడేళ్ల కష్టార్జితం
ఇది చూసిన కొందరు.. భర్తను వదిలేసి జల్సా చేస్తున్నావా? నువ్వేదో రోల్స్‌ రాయిస్‌ కారు కొన్నట్లు బిల్డప్‌ ఇస్తున్నావే అని కామెంట్లు చేశారు. దీనికి సంయుత స్పందిస్తూ.. 'నేను మూడేళ్లు కష్టపడి మొదటిసారి ఓ కారు కొన్నాను. ఇది మిగతావారికి గొప్ప విషయం కాదేమో కానీ నాకు మాత్రం అద్భుతమైనదే! అయినా నీ పని నువ్వు చేసుకోకుండా ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టడం నీకవసరమా?' అని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

చదవండి: చంద్రయాన్‌ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ హీరోయిన్‌

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)