Breaking News

హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్

Published on Tue, 06/17/2025 - 12:34

'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' డిజాస్టర్ల దెబ్బకు పూర్తిగా ఆలోచనలో పడిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. తన రూట్ మార్చి స్టోరీ రాశాడు. దాన్ని తమిళ నటుడు విజయ్ సేతుపతికి చెప్పి మెప్పించాడు. కొన్ని నెలల క్రితం ఈ  ప్రాజెక్ట్ అనౌన్స్ కాగా.. ఇందులో ఎవరెవరు నటిస్తారనే విషయాన్ని ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. తాజాగా హిట్ చిత్రాల హీరోయిన్‌ని తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మలయాళ నటి సంయుక్త.. ఇప్పటివరకు చాలా సినిమాలు చేసింది. వాటిలో చాలావరకు హిట్ అయ్యాయి. తెలుగులోనూ భీమ్లా నాయక్, బింబిసార, సర్, విరూపాక్ష తదితర చిత్రాలతో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం స్వయంభు, అఖండ 2, హైందవ, నారీ నారీ నడుమ మురారీ అని నాలుగు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు పూరీ-విజయ్ సేతుపతి ప్రాజెక్ట్‌లోకి ఎంటరైంది.

(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం)

సంయుక్తని తీసుకున్న విషయాన్ని పూరీ-ఛార్మీ ప్రకటించారు. ఆమెతో కలిసున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ సేతుపతి మూవీలో ఇప్పటికే టబు, కన్నడ నటుడు దునియా విజయ్ ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సంయుక్త కూడా ఉందనేసరికి మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో సేతుపతి.. బిచ్చగాడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమా విషయంలో పూరీ జగన్నాథ్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో తాను తీసిన సినిమాలు విషయంలో ఏ తప్పులైతే జరిగాయో ఈసారి అలాంటివేం జరగకుండా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించాలని భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం విజయ్ సేతుపతిని పూరీ సినిమా చేస్తున్న సినిమా గురించి అడిగితే.. తనకు కథ నచ్చే అవకాశమిచ్చానని, ఆయన గత చిత్రాల ఫ్లాప్ కావడం తనకేం సమస్య కాదని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్‌.. రిలీజ్‌కు ముందే రికార్డు!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)