షారూఖ్ ఖాన్‌కు బిగ్‌ షాక్‌.. రెండు కోట్ల పరువు నష్టం కేసు!

Published on Thu, 09/25/2025 - 17:54

బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ నెల 18న ఓటీటీకి వచ్చిన ఈ సిరీస్‌ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ వెబ్ సిరీస్‌లో తనను తప్పుగా చూపించారంటూ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మాజీ అధికారి సమీర్‌ వాంఖడే పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సిరీస్‌లోని ఓ ఎపిసోడ్‌లో ఆర్యన్‌ను డ్రగ్ కేసులో అరెస్టు చేసిన అధికారి సమీర్ వాంఖడేతో పోలిక ఉందని నెటిజన్లు కామెంట్స్‌ చేయడంతో ఈ వివాదానికి దారితీసింది.

దీంతో తనను ఉద్దేశపూర్వకంగానే తప్పుగా చూపించారని మాజీ అధికారి సమీర్ వాంఖడే ఆరోపిస్తూ.. షారుఖ్ ఖాన్,  ఆయన సతీమణి గౌరీ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రెండు కోట్ల రూపాయల పరిహారం కోరుతూ పిటిషన్ వేశారు. ఇందులో తనపై దురుద్దేశంతోనే తప్పుగా చిత్రీకరించారని సమీర్ వాంఖడే ఆరోపించారు. ఇలాంటి వాటితో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ రూ. 2 కోట్ల పరిహారాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని పిటిషన్‌లో ప్రతిపాదించారు.

కాగా.. గతంలో సమీర్ వాంఖడే ముంబై తీరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్‌ డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ను అరెస్టు చేశారు. ఆ సమయంలో సమీర్ వాంఖడే ఈ కేసును డీల్ చేశారు. ఈ కేసులో ఆర్యన్‌ను దాదాపు నెల రోజులు జైలులో ఉంచారు. ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఆ తర్వాత 2023లో ఈ కేసులో ఉన్న వారి నుంచి రూ.25 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)